ETV Bharat / sitara

RRR NEWS: 'ఆర్ఆర్ఆర్' కోసం అనిరుధ్.. కీరవాణి ట్వీట్ - మూవీ న్యూస్

ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్'లో స్టార్ సంగీతదర్శకుడు అనిరుధ్​ కూడా భాగమయ్యారు. కీరవాణి సారథ్యంలో ఓ పాట పాడినట్లు తెలుస్తోంది. త్వరలో ఆ గీతం గురించి వెల్లడించే అవకాశముంది.

RRR: MM Keeravani completes recording with Anirudh
అనిరుధ్
author img

By

Published : Jul 26, 2021, 9:23 AM IST

షూటింగ్​ చివరిదశలో ఉన్న 'ఆర్ఆర్ఆర్'.. అక్టోబరు 13న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్​లో ఉన్న ఈ చిత్రం కోసం ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్​ కూడా పనిచేయనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ట్వీట్ చేశారు.

.
.

అనిరుధ్​తో కలిసి పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పిన కీరవాణి.. అతడు డౌన్​టూ ఎర్త్​ పర్సన్​ అని రాసుకొచ్చారు. దీనిపై స్పందించిన అనిరుధ్​.. 'ఆర్ఆర్ఆర్' బృందంలో భాగమైనందుకు తనకు సంతోషంగా ఉందని రీట్వీట్ చేశారు. అయితే అనిరుధ్ ఈ సినిమాలోని ఓ పాట పాడాడని, ఆగస్టు 1న ఫ్రెండ్​షిప్​ డే సందర్భంగా దానిని రిలీజ్​ చేయనున్నారట.

ఈ సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​ పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల వచ్చిన 'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్' పేరుతో వచ్చిన మేకింగ్ వీడియో అభిమానుల్ని అలరిస్తూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతమందిస్తున్నారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్ల బడ్జెట్​తో నిర్మిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మరోవైపు ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్​లో రూపొందే సినిమాకు కూడా అనిరుధ్​ను మ్యూజిక్ డైరెక్టర్​గా తీసుకోవాలని భావిస్తున్నారట. దీనిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశముంది. ఒకవేళ ఇదే నిజమైతే తారక్​-అనిరుధ్​ వరుసగా కలిసి పనిచేసినట్లవుతుంది.

.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.