హీరో విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్'లో కొన్ని సన్నివేశాల్లో బోల్డ్‌గా నటించి, అభిమానుల్ని ఆశ్యర్యానికి గురిచేసింది హీరోయిన్ రాశీఖన్నా. ముఖ్యంగా టీజర్లో ఆమె టాప్‌లెస్‌గా కనిపించడం సహా లిప్‌లాక్, రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయింది. ఇలా కావాలనే నటించానని చెప్పిందీ భామ. అందుకు గల కారణాలు వెల్లడించింది.
![REASON BEHIND RAASHI ACTS BOLD IN WORLD FAMOUS LOVER](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5967057_raashi-wfl.jpg)
"ఈ సినిమాలో అందరూ అనుకున్నట్లు యామిని పాత్ర బోల్డ్ కాదు. ఒకటి రెండు సన్నివేశాలు చూసి, నాపైనా, చిత్రంపైనా అంచనాకు రావడం సరికాదు. కథాబలమున్న సినిమాల్లో ఇలాంటి సీన్లు తప్పనిసరి. కథ డిమాండ్ చేసింది కాబట్టే అలా నటించాల్సి వచ్చింది" -రాశీఖన్నా, హీరోయిన్
ఇటీవలే వచ్చిన టీజర్ అలరిస్తోంది. రేపు(గురువారం) ట్రైలర్ రానుంది. వాలంటైన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఇందులో విజయ్ సరసన రాశీఖన్నాతో పాటు ఐశ్వర్య రాజేశ్, కేథరిన్, ఇస్బెల్లా హీరోయిన్లుగా నటించారు. గోపీసుందర్ సంగీతమందించాడు. క్రాంతి మాధవ్ దర్శకుడు. కెఎస్ రామారావు నిర్మించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">