ETV Bharat / sitara

చెర్రీ యాక్షన్‌ షురూ.. సైఫ్‌ తప్పుకొన్న చిత్రంలో కరీనా - kiara advani

Ram Charan Shankar Movie: శంకర్​-రామ్​చరణ్​ కాంబోలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్​ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్స్‌లో చెర్రీపై పోరాట ఘట్టాల్ని చిత్రీకరిస్తున్నారు. కాగా, బాలీవుడ్​ హీరో సైఫ్​ అలీఖాన్​ తప్పుకొన్న ఓ చిత్రంలో నటించేందుకు ఆయన భార్య, హీరోయన్​ కరీనా కపూర్​ గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు తెలిసింది!

ram charan shankar movie
kareena kapoor
author img

By

Published : Feb 5, 2022, 7:21 AM IST

Updated : Feb 5, 2022, 8:48 AM IST

Ram Charan Shankar Movie: 'ఆర్‌.ఆర్‌.ఆర్‌', 'ఆచార్య'... ఈ రెండు సినిమాలూ ఒక దాని వెంట మరొకటి విడుదలవుతాయి. అయినా సరే, విశ్రమించేది లేదు అంటున్నారు రామ్‌ చరణ్‌. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో చిత్రాన్ని వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. త్వరలోనే మరో దఫా ఆ సినిమాచిత్రీకరణలో పాల్గొననున్నారు. అందుకోసం ఏర్పాట్లు పూర్తయినట్టుతెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్స్‌లో రామ్‌చరణ్‌పై పోరాట ఘట్టాల్ని తెరకెక్కించనున్నారు. ఆ వెంటనే అమృత్‌సర్‌లోనూ చిత్రీకరణ చేయనున్నట్టు తెలుస్తోంది. రాజకీయం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్‌చరణ్‌ ఓ ఐఏఎస్‌ అధికారిగా కనిపించనున్నారు. ఆయనకి జోడీగా కియారా అడ్వాణీ నటిస్తోంది. దిల్‌రాజు నిర్మిస్తున్నారు.

kiara advani
కియారా

సైఫ్‌ తప్పుకొన్న చిత్రంలో కరీనా

'కహానీ', 'బద్లా' లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుజయ్‌ ఘోష్‌. ఆయన ఇటీవలే ఓ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. కైగో హిగాషినో రాసిన 'ది డివోషన్‌ ఆఫ్‌ సస్పెక్ట్‌ ఎక్స్‌' కథని సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రలో సినిమాగా తీయాలని 2015లోనే సన్నాహాలు మొదలుపెట్టారు. అనుకోని కారణాలతో ఈ చిత్రం పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఇన్నేళ్లకు మళ్లీ ఇదే కథతో చిత్రాన్ని తీయనున్నారు సుజయ్‌. ఈ సారి ఈ చిత్రంలో సైఫ్‌ భార్య, కథానాయిక కరీనా కపూర్‌ నటించనుండటం విశేషం. జయదీప్‌ అహ్లావట్, విజయ్‌ వర్మ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల నుంచి సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు.

kareena kapoor
కరీనా

ఇదీ చూడండి: హృతిక్​ రోషన్​ వల్ల దానిపై ఆసక్తి పెరిగింది: నేహా శెట్టి

Last Updated : Feb 5, 2022, 8:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.