ETV Bharat / sitara

స్పోర్ట్స్​ డ్రామాగా చరణ్​-గౌతమ్​ సినిమా! - ram charan shankar movie

హీరో రామ్​చరణ్​-దర్శకుడు గౌతమ్​ తిన్ననూరి కాంబోలో తెరకెక్కబోయే సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మూవీ కథ ఇదేనంటూ అంతా మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అది ఏంటంటే?

ram
రామ్​చరణ్​
author img

By

Published : Nov 15, 2021, 7:46 AM IST

త్వరలోనే 'ఆర్ఆర్ఆర్'తో ప్రేక్షకుల ముందుకు రానున్న మెగా పవర్​స్టార్ రామ్​చరణ్(ram charan movies) ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(ram charan new movie) దర్శకత్వంలో తెరకెక్కనున్న మరో బడా ప్రాజెక్ట్​లో నటిస్తారు. అయితే ఇప్పుడా సినిమా కథ గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 'జెర్సీ' తరహాలోనే ఈ మూవీ కూడా స్పోర్ట్స్​ డ్రామాగా రూపొందనుందని అంతా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తి స్క్రిప్ట్​ను సిద్ధం చేసే పనిలో ఉన్నారని తెలిసింది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో.. స్పోర్ట్స్​ డ్రామా సినిమాలో నటించడం తన డ్రీమ్​ ప్రాజెక్ట్​ అని చెప్పాడు చరణ్​. ఒకవేళ గౌతమ్ తెరకెక్కించే సినిమా స్పోర్ట్స్​ డ్రామా అయితే చెర్రీ కల నిజమైనట్లే!

'మళ్లీరావా', 'జెర్సీ' సినిమాలతో మెప్పించారు గౌతమ్ తిన్ననూరి. హిందీలోనూ 'జెర్సీ' రీమేక్(jersey hindi remake heroine) చేశారు. అది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక చెర్రీ నటించిన 'ఆర్​ఆర్​ఆర్'​ వచ్చే ఏడాది జనవరి 7న థియేటర్లో విడుదల కానుంది.

ఇదీ చూడండి: జాతీయ స్థాయిలో మెరిసిన 'జెర్సీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.