ETV Bharat / sitara

శంకర్​-చెర్రీ సినిమాలో ముగ్గురు స్టార్​ నటీనటులు! - Jayaram

రామ్​చరణ్​-శంకర్​ కాంబోలో రూపొందనున్న చిత్రం గురించి టాలీవుడ్​లో మరోసారి చర్చ నడుస్తోంది. ఇందులో రెండు కీలకపాత్రల కోసం హీరోయిన్​ అంజలితో పాటు మలయాళ నటుడు జయరామ్​లను ఎంపిక చేసినట్లు సమాచారం. వీరితో పాటు విలన్​ పాత్ర కోసం ఫహాద్​ ఫాజిల్​ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

Ram Charan and Shankar film exclusive updates
శంకర్​-చెర్రీ సినిమాలో ముగ్గురు స్టార్​ నటీనటులు!
author img

By

Published : Aug 26, 2021, 4:31 PM IST

దర్శకుడు శంకర్​-హీరో రామ్​చరణ్​ కాంబోలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న సినిమాపై ఇప్పుడు టాలీవుడ్​లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్​గా కియారా అడ్వాణీని ఎంపిక చేయగా.. మరో రెండు కీలకపాత్రల కోసం హీరోయిన్​ అంజలి, మలయాళ నటుడు జయరామ్​లను సంప్రదించినట్లు సమాచారం. వీరిద్దరూ ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో విలన్​ పాత్ర కోసం మలయాళ నటుడు ఫహాద్​ ఫాజిల్​తో చర్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఫహాద్​ ప్రస్తుతం అల్లు అర్జున్​ ప్రధానపాత్రలో నటిస్తున్న 'పుష్ప' చిత్రంలో నటిస్తున్నారు.

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాను తెరకెక్కించనున్నారు. తమన్​ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవల 135 మంది మ్యూజిషియన్లతో కలిసి ఆయన ఈ సినిమాకు సంబంధించిన​ తొలి రికార్డింగ్​ పూర్తి చేశారు. కొరియోగ్రాఫర్​గా జానీ మాస్టర్, మాటల రచయితగా సాయి మాధవ్​ బుర్రాను ఇప్పటికే ఎంపిక చేసింది చిత్రబృందం.

ఇదీ చూడండి.. మన హీరోలకు విలన్లు.. అదిరే కాంబినేషన్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.