ETV Bharat / sitara

Pushpa: వసూళ్లలో తగ్గేదే లే.. యూఎస్​ఏలో 'పుష్ప' రికార్డు - రష్మిక

Pushpa Collections: భారత్​లో సహా విదేశాల్లో 'పుష్ప'రాజ్ హవా కొనసాగుతోంది. థియేటర్లలో వసూళ్ల వర్షం కురుస్తోంది. తాజాగా యూఎస్​ఏలో 'పుష్ప' 2 మిలియన్ డాలర్ల మార్కును అందుకుందని చిత్రబృందం వెల్లడించింది.

pushpa
పుష్ప
author img

By

Published : Dec 24, 2021, 12:18 PM IST

Pushpa: ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప'.. కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఐదు భారతీయ భాషల్లో డిసెంబర్​ 17న విడుదలైన ఈ సినిమా ఓవర్సీస్​లోనూ జోరు చూపిస్తోంది. తాజాగా ఈ చిత్రం యూఎస్​ఏలో 2 మిలియన్ డాలర్లను వసూళు చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. దీంతో ఈ ఏడాదిలో యూఎస్​లో ఈ మైలురాయిని అందుకున్న తొలి దక్షిణాది చిత్రంగా 'పుష్ప' నిలిచిందని పేర్కొంది.

Pushpa collections
'పుష్ప' రికార్డు కలెక్షన్స్

కాకినాడ సక్సెస్ మీట్ వాయిదా

పుష్ప విజయంతో జోరుమీదున్న చిత్రబృందం విజయోత్సవ వేడుకలు ఘనంగా జరుపుతోంది. ఈ క్రమంలోనే శుక్రవారం కాకినాడలో సక్సెస్ మీట్ జరగాల్సి ఉంది. కానీ అధికారులు అనుమతి ఇవ్వకపోవడం వల్ల ఈ వేడుకను వాయిదా వేసినట్లు తెలిపింది చిత్రబృందం. అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తూ ఓ ట్వీట్ చేసింది.

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్​గా నటించింది. ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. పుష్పరాజ్​గా బన్నీ నటనకు ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. త్వరలోనే పార్ట్​2ను (పుష్ప: ది రూల్) తెరకెక్కించనున్నారు సుకుమార్.

ఇవీ చూడండి:

వార్నర్​కు పోటీగా జడేజా.. 'పుష్ప' వీడియోతో 'తగ్గేదే లే'

'పుష్ప' సినిమాకు అనసూయ పారితోషికం ఎంతంటే?

'పుష్ప' క్రెడిట్ మొత్తం ఆయనదే: అల్లు అర్జున్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.