కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్ మరణం చాలామందికి షాక్‌కు గురిచేసింది. ఎందుకంటే ఓ మంచి నటుడే కాదు అంతకు మించిన గొప్ప మనిషిని కోల్పోయామనే బాధ. ఆయన ఇకలేరు, మరి సినిమాలు చేయరు అంటే ఏదో తెలియని వెలితి.
వెండితెరపై కథానాయకుడిగా, నటుడిగా ఎందరో మనసుల్ని గెలిచారు. బయటకూడా చాలామంచి పనులు చేసి ప్రజల్ని హృదయాల్లో చెరగని స్థానం సంపాదించారు.
ఇంతకీ ఏమేం చేశారంటే?
45 ఉచిత పాఠశాలలు ఏర్పాటు చేసి 1800 మంది విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నారు. 26 అనాథ ఆశ్రమాలు, 16 వృద్ధ ఆశ్రమాలు, 19 గోశాలు ఏర్పాటు చేసి తన మంచి మనసు చాటుకున్నారు.
మరణానంతరం తన రెండు కళ్లను దానం చేసిన గొప్ప వ్యక్తి పునీత్ రాజ్‌కుమార్. అందుకే కన్నడ ప్రేక్షకులకు ఆయనంటే అంత అభిమానం. అందుకే తెలుగు ప్రేక్షకులు కూడా ఆ నిజమైన హీరో మరణవార్త విని తల్లడిల్లిపోతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
ఇవీ చదవండి:
- Puneeth Rajkumar news: టాలీవుడ్‌తో పునీత్‌కు ఎనలేని 'బంధం'
- పునీత్ పార్థివ దేహాం వద్ద బాలకృష్ణ కన్నీటి పర్యంతం
- తండ్రిలానే పునీత్ రాజ్‌కుమార్.. 2006లోనూ ఇలాగే!
- పునీత్ మరణవార్త చూసి అభిమాని మృతి
- కుమార్తె వచ్చిన తర్వాతే పునీత్ అంత్యక్రియలు
- కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం
- Puneeth Rajkumar News: నవంబర్ 1న పునీత్ ఏం చెప్పాలనుకున్నారు?
- నేత్రదానం చేసిన పునీత్.. తండ్రి అడుగుజాడల్లోనే...
- Puneeth Rajkumar News: ఆరు నెలల వయసులోనే సినీ అరంగేట్రం!
- పునీత్‌కు 'పవర్ స్టార్' బిరుదు ఎవరిచ్చారో తెలుసా?