ETV Bharat / sitara

పవర్​స్టార్​ పునీత్​కు రాష్ట్ర అత్యున్నత పురస్కారం- పద్మశ్రీ కూడా! - పునీత్​ రాజ్​ కుమార్​ న్యూస్​

గుండెపోటుతో ఇటీవలే తుదిశ్వాస విడిచిన కన్నడ స్టార్​ హీరో పునీత్​ రాజ్​కుమార్​కు ఆ రాష్ట్ర అత్యున్నత పురస్కారమైన 'కర్ణాటక రత్న'ను ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రకటించారు.

puneeth rajkumar
పవర్​స్టార్​ పునీత్​కు రాష్ట్ర అత్యున్నత పురస్కారం
author img

By

Published : Nov 16, 2021, 6:54 PM IST

Updated : Nov 16, 2021, 7:47 PM IST

ఇటీవల మరణించిన కన్నడ పవర్​ స్టార్​ పునీత్​ రాజ్​ కుమార్​కు (puneeth rajkumar death) 'కర్ణాటక రత్న' పురస్కారాన్ని (karnataka ratna award) ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రకటించారు. 'పునీత్​ నమన' (పునీత్​కు వందనం) పేరుతో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పునీత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. చాలామందితో సమాలోచనలు చేసిన తరువాత పునీత్​కు కర్ణాటక అత్యున్నత పురస్కారమైన కర్ణాటక రత్నను ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

పవర్​స్టార్​ పునీత్​కు రాష్ట్ర అత్యున్నత పురస్కారం

అప్పుకు కర్ణాటక రత్న అవార్డు ప్రకటించగానే కార్యక్రమానికి వచ్చిన మాజీ సీఎం బీఎస్​ యడియూరప్ప, ప్రతిపక్ష సిద్ధ రామయ్యతో పాటు అక్కడున్న వారంతా ఒక్కసారిగా లేచి కరతాళధ్వనులతో తమ సమ్మతిని తెలిపారు. ఇప్పటివరకు ఈ అవార్డును 9 మందికి ప్రకటించగా.. 10వ వ్యక్తిగా పవర్​ స్టార్​ నిలవనున్నారు.

పద్మశ్రీ అవార్డుకు సిఫార్సు..

పునీత్ రాజ్‌కుమార్‌ పేరును పద్మశ్రీ అవార్డును సిఫార్సు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి బొమ్మై పేర్కొన్నారు. కంఠీరవ స్టూడియోలో దివంగత నటుడు డా.రాజకుమార్ స్మారక చిహ్నం పక్కనే పునీత్ రాజ్‌కుమార్ మెమోరియల్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు.

పునీత్ రాజ్​కుమార్​.. కన్నడ దిగ్గజ నటుడు రాజ్​కుమార్​ కుమారుడు. ఐదుగురు సంతానంలో ఆయనే చిన్నవాడు. అక్టోబర్ 29న వ్యాయామం చేస్తూ గుండెపోటు రాగా ఆస్పత్రిలో చేరిన పునీత్​.. ఆరోజే మరణించారు(puneeth rajkumar news). 6 నెలల వయసులోనే వెండితెర తెరంగ్రేట్రం చేసిన ఆయన.. 2002లో అప్పు సినిమా ద్వారా హీరోగా పరిచమయ్యారు. పలు సూపర్​హిట్ సినిమాల్లో నటించి కన్నడ పవర్​స్టార్​గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి గొప్ప దాతృత్వం చాటుకున్నారు.

ఇదీ చూడండి: హీరో​ కుటుంబంలో విషాదం- యాక్సిడెంట్​లో ఒకేసారి ఆరుగురు మృతి

Last Updated : Nov 16, 2021, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.