ETV Bharat / sitara

షూటింగ్​కు సిద్ధమైన పవన్​-రానా మల్టీస్టారర్​! - అయ్యప్పనుమ్ కోశియుమ్

'అయ్యప్పనుమ్​ కోశియుమ్​'(Ayyappanum Koshiyum) తెలుగు రీమేక్​ షూటింగ్​ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. ఈ నెల రెండో వారం నుంచి జరగనున్న షెడ్యూల్​ను యాక్షన్​ సీక్వెన్స్​తో షురూ చేయనున్నారని సమాచారం. ఇందులో పవన్​ కల్యాణ్​తో(Pawan Kalyan) పాటు రానా(Rana Daggubati), నిత్యామేనన్(Nithya Menen)​ పాల్గొననున్నారని తెలుస్తోంది.

PSPK Rana Movie to resume the film shooting from July 12?
షూటింగ్​కు సిద్ధమైన పవన్​-రానా మల్టీస్టారర్​
author img

By

Published : Jul 6, 2021, 4:21 PM IST

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan), రానా దగ్గుబాటి (Rana Daggubati) ప్రధాన పాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి చివర్లో షూటింగ్​ను ఆపేశారు. ఇప్పుడు చిత్రసీమలో చిత్రీకరణలు జోరుగా సాగుతున్న వేళ.. ఈ చిత్ర షూటింగ్​ను తిరిగి ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నద్ధమవుతోంది.

జులై 12 నుంచి షూటింగ్​ను తిరిగి ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అదే రోజు నుంచి సినిమాలోని ఓ యాక్షన్​ సన్నివేశాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్​లో పవన్​, రానా ఇద్దరు కలిసి చిత్రీకరణలో పాల్గొననున్నారని తెలుస్తోంది.

టైటిల్​ ఇదేనా?

పవన్​-రానా ప్రధానపాత్రల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు టైటిల్​ ఇదేనంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. 'పరశురామ కృష్ణమూర్తి' అనే టైటిల్​ను చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ టైటిల్​ను రిజిష్టర్​ చేసి ఆగస్టులో అధికారికంగా ప్రకటించనున్నారని టాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి.

మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన 'అయ్యప్పనుమ్‌ కోషియుమ్'కు (Ayyappan Koshyum) రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో పవన్​కల్యాణ్, రానా దగ్గుబాటితో పాటు ఐశ్వర్యారాజేశ్​(Aishwarya Rajesh), నిత్యామేనన్(Nithya Menen)​ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో రానున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌(Trivikram Srinivas) మాటల రచయితగా వ్యవహరించనున్నారు.

ఇదీ చూడండి.. సెట్లో అడుగుపెట్టిన రానా.. పవన్​తో ఫైట్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.