ETV Bharat / sitara

నిక్ సతీమణి ట్యాగ్.. ప్రియాంక చోప్రా ఆగ్రహం - Priyanka Chopra matrix series

అంతర్జాతీయ మీడియా తనను నిక్ సతీమణి అంటూ రాయడంపై నటి ప్రియాంక చోప్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు మాత్రమే ఎందుకు ఇలా అని ఆవేదన చెందారు.

Priyanka Chopra
ప్రియాంక చోప్రా
author img

By

Published : Dec 17, 2021, 9:27 PM IST

ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటిగా బాలీవుడ్‌, హాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్న తార ప్రియాంక చోప్రా. హాలీవుడ్‌కు చెందిన పాప్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌ను పెళ్లి చేసుకున్న ఆమె.. ప్రస్తుతం అక్కడి చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. కెరీర్‌ పరంగా ఉన్నత శిఖరాలు అధిరోహించినప్పటికీ కొన్ని అంతర్జాతీయ పత్రికలు ఆమెను నిక్‌ సతీమణిగానే అభివర్ణించడంపై ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు మాత్రమే ఎప్పుడూ ఎందుకు ఇలా జరుగుతుంది?అని ఆమె ఆవేదన చెందారు.

Priyanka Chopra Nick Jonas
ప్రియాంక చోప్రా నిక్ జొనాస్

ప్రస్తుతం ప్రియాంక 'మ్యాట్రిక్స్‌ రిజరాక్షన్స్' (Matrix Resurrections) సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సైన్స్ ఫిక్షన్‌, యాక్షన్‌ డ్రామా కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా జరిగిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ప్రియాంక.. సినిమాపై ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అంతర్జాతీయ మీడియా పలు వార్తలు ప్రచురించింది.

వాటిల్లో నిక్‌ జొనాస్‌ సతీమణి మ్యాట్రిక్స్‌ విశేషాలపై స్పందించారు అని రాయగా.. ఆయా వార్తల స్క్రీన్‌షాట్స్‌ షేర్‌ చేసిన ప్రియాంక... "ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సిరీస్‌ల్లో ఒకటైన మ్యాట్రిక్స్ ప్రమోషన్స్‌లో పాల్గొన్నప్పటికీ.. నన్ను ఓ వ్యక్తి భార్యగానే అభివర్ణించడం ఆశ్చర్యంగా ఉంది. మహిళలకు ఇంకా ఇలాగే ఎందుకు జరుగుతుందో దయచేసి చెప్పండి? ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నింటి జాబితా నా ఇన్‌స్టా బయోలో పెట్టుకోవాలేమో?" అని ప్రియాంక కామెంట్‌ చేశారు.

matrix team
మ్యాట్రిక్స్ టీమ్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.