గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా షేర్ చేసిన ఓ సెల్ఫీ అభిమానులను కలవరపాటుకు గురిచేసింది. షూటింగ్ సెట్లో సరదాగా దిగిన ఈ ఫొటోలో కనిపిస్తున్న గాయాల్లో ఏది నిజమో గుర్తించాలని తన అభిమానులను ప్రశ్నించింది.
ప్రస్తుతం లండన్‌లో చిత్రీకరణ జరుపుకొంటున్న స్పై సిరీస్ 'సిటాడెల్' సెట్లో తీసిన ఈ ఫొటోలో ప్రియాంక ముఖం, నుదిటిపై రక్తపు గాయాలున్నాయి. దీనిపై 'ది స్కై ఈజ్ పింక్' హీరో స్పందించాడు. ప్రియాంక కనుబొమ్మపై ఉన్న మచ్చ నిజమేనని.. కానీ ఆమె చెంపపై ఉన్న రక్తపు మరకలు నకిలీవని తెలిపాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
'సిటాడెల్'ను అమెజాన్ తెరకెక్కిస్తోంది. ఈ చిత్రానికి రూసో బ్రదర్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక హాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తున్న ప్రియాంక 'సిటాడెల్' తర్వాత 'మ్యాట్రిక్స్ 4'లో నటించనుంది. ప్రముఖ నటుడు, నిర్మాత ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో బాలీవుడ్లో 'జీ లే జరా' అనే సినిమాలోనూ కనిపించనుంది. ఈ చిత్రంలో ప్రియాంకతో పాటు కత్రినా కైఫ్, ఆలియా భట్లు ప్రధాన పాత్రలు పోషించనున్నారు.
ఇవీ చదవండి: