ప్రేమ.. ప్రతి వ్యక్తి జీవితం ఓ పుస్తకం అనుకుంటే ఈ పేజీ తప్పనిసరిగా తిప్పాల్సిందే... ఇందులో కొన్ని రాతలు రాయాల్సిందే... పరీక్షలో ఫెయిల్ అయినా.. ప్రేమ పరీక్షలో పాసవ్వాలనుకుంటాడు విద్యార్థి... ఇంక్రిమెంట్లు రాకపోయినా... లవ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటాడు ఉద్యోగి... పళ్లూడి పోయినా... ప్రేమ ఫలాలను ఆరగించాలనుకుంటాడు వయోధికుడు. ఇలా ప్రతి ఒక్కరూ... మదిలోని ప్రేమను తమ ప్రేయసికి చెప్పేందుకు తహతహలాడుతుంటారు. ప్రేమికుల రోజు సందర్భంగా మన సినిమాలలో కొన్ని బెస్ట్ ప్రపోజల్స్ చూడండి.
- ఆర్య: ఫీల్ మై లవ్:
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నువ్వు ప్రేమించకపోతే బిల్డింగ్ మీద నుంచి దూకి చచ్చిపోతా... ప్రేమిస్తావా లేదా! అంటే ఏ అమ్మాయైనా రోటీన్‌గా ఏం చేస్తుంది. తప్పకుండా సరే అంటుంది. ఆర్య చిత్రంలోనూ అదే జరిగింది. ఇంతలో మరో కుర్రాడు వచ్చి అదే అమ్మాయికి ఐ లవ్యూ అని చెప్పి గులాబీ ఇస్తాడు. అంతే యువత ఈలలు, గోలల నడుమ మంచి విజయాన్ని అందుకుందీ చిత్రం. అనంతరం 'నీకోసమే నిరీక్షణ' అంటూ సాగే ప్రేమ లేఖలోనూ ఫీల్ తెప్పించాడు దర్శకుడు...సినిమా అంతా ఫీల్ మై లవ్ అంటూ సాగుతూ...వన్‌సైడ్ లవ్ ఎంతో బెటర్ అనే కోణాాన్ని దర్శకుడు చూపించాడు. 2004లో వచ్చిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, అను మెహతా జంటగా నటించారు.
- రబ్ నే బనా ది జోడీ: విద్యుత్‌దీపాలతో ప్రేమ దీపం
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- సూర్య సన్ ఆఫ్ కృష్ణన్: ప్రేమ కోసం అమెరికా వెళ్లాడు
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- ఓయ్: నెలకో గిఫ్ట్
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- ఏమాయ చేసావే: తొలిప్రేమ అంత సులభంగా పోదు
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రేమకు... సినిమాకు అవినాభావ సంబంధం ఉంది. మనసులో ఉండే భావాల్ని తెరపై చూపించి ప్రేమికులు చేయాల్సిన పనిని సినిమా సులభం చేసింది. ప్రస్తుతం సినిమా ఏదైనా... ప్రేమ అనే అంశాన్ని తప్పనిసరిగా చేరుస్తున్నారు దర్శకులు. 95 శాతం సినిమాల్లో హీరోహీరోయిన్ను ప్రేమించే పెళ్లాడుతున్నాడు. మరి ప్రేమికుల రోజు ఈ చిత్రాల్నీ మీ వాళ్లతో చూస్తూ ఈ ప్రపంచాన్ని మర్చిపోతారు కదూ..!