రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 'రాధేశ్యామ్', 'సలార్' చిత్రాలతో పాటు 'ఆదిపురుష్' చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. ముంబయిలో వేసిన ప్రత్యేక సెట్లో అతడికి సంబంధించిన కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.
అయితే త్వరలో 'ఆదిపురుష్' కోసం ప్రభాస్ యూకే వెళ్లనున్నారట. ఇంటర్నేషనల్ డైటీషియన్ ఆధర్వంలో తన లుక్‌పై దృష్టిపెట్టి సరికొత్తగా కనిపించనున్నారట.

మరి ప్రభాస్ ఎలాంటి లుక్‌తో కనిపిస్తారో, ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఎంతలా అలరిస్తారో తెలియాలంటే వచ్చే ఏడాది ఆగస్టులో 'ఆదిపురుష్' విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.
ఈ సినిమాలో కృతిసనన్ సీత పాత్ర పోషిస్తుంది. బాలీవుడ్‌కు చెందిన ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇవీ చదవండి: