ETV Bharat / sitara

రాధేశ్యామ్ 'సంచారి' సాంగ్​ రిలీజ్​ - ​ రాధేశ్యామ్​ సంచారీ సాంగ్​

Radhe shyam Sanchari song: ప్రభాస్​ నటించిన 'రాధేశ్యామ్'​ సినిమా నుంచి 'సంచారి' సాంగ్​ రిలీజై అలరిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 14న విడుదల​ కానుంది.

రాధేశ్యామ్​ సంచారి సాంగ్​ రిలీజ్​, Prabhas Radhe shyam Sanchari song release
రాధేశ్యామ్​ సంచారి సాంగ్​ రిలీజ్​
author img

By

Published : Dec 16, 2021, 12:29 PM IST

Radhe shyam Sanchari song: 'రాధేశ్యామ్' నుంచి మరో సాంగ్​ రిలీజ్​ అయింది. 'సంచారి' అంటూ సాగే ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. ఇందులో విజువల్స్​ చాలా రిచ్​గా ఉన్నాయి. ప్రభాస్​.. లవర్​బాయ్​గా, లైఫ్​ ఎంజాయ్​ చేస్తున్నట్లు కనిపించారు. పాటలో లొకేషన్స్​ ఆకట్టుకుంటున్నాయి. కొన్ని సన్నివేశాల్లో డార్లింగ్​ స్టంట్లు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు కూడా అభిమానులను విపరీతంగా ఉర్రూతలూగించాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కాగా, 1970ల నాటి యూరప్​ నేపథ్య కథతో 'రాధేశ్యామ్'ను తెరకెక్కించారు. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్​గా చేసింది. అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ కీలకపాత్ర పోషించారు. దక్షిణాదిలో జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్-గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ట్రైలర్​ను డిసెంబరు 23న విడుదల చేస్తారని సమాచారం.

ఇదీ చూడండి: ప్రభాస్​తో తొలిరోజు షూటింగ్​ అలా గడిచింది: దీపిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.