ETV Bharat / sitara

'రాధేశ్యామ్​' ఫస్ట్​ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే? - సెన్సార్​ బోర్డు సభ్యుడు ఉమైర్​ సంధు

RadheShyam first review: 'రాధేశ్యామ్​' సినిమాను వీక్షించిన సెన్సార్​ బోర్డు సభ్యుడు, సినీ విశ్లేషకుడు ఉమైర్​ సంధు ఫస్ట్​రివ్యూను సోషల్​మీడియాలో పోస్ట్​ చేశారు. సినిమా అద్భతంగా ఉందని, ఇక ఈ చిత్ర క్లైమాక్స్​ అంచనాలకు అందనంత గొప్పగా ఉందని కొనియాడారు.

RadheShyam first review:
RadheShyam first review:
author img

By

Published : Mar 6, 2022, 2:59 PM IST

RadheShyam first review: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'రాధేశ్యామ్​'. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రాధాకృష్ణ ధర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రభాస్​ సరసన పూజాహెగ్డే నటించింది. పీరియాడికల్​ లవ్​స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా వీక్షించిన సెన్సార్​ బోర్డు సభ్యుడు, సినీ విశ్లేషకుడు ఉమైర్​ సంధు ఫస్ట్​రివ్యూ ఇచ్చారు. సినిమా అద్భుతంగా ఉందని కొనియాడారు.

"ప్రభాస్​ క్లాస్​, స్టైల్​ను భారత్​లో ఎవరూ బీట్​ చేయలేరు. రాధేశ్యామ్​లో ఎంతో అందంగా ఉన్నారు. ఆయన నటన ఎంతో అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో వీఎఫ్​ఎక్స్​ కళ్లు చెదిరేలా ఉన్నాయి. ప్రభాస్​, పూజాహెగ్డే కెమిస్ట్రీ మైండ్​ బ్లోయింగ్​. ఇది అద్భుతమైన సినిమా. ఇక క్లైమాక్స్​ ఓ అద్భుతమైన అనుభూతి. ఎవరూ ఊహించనంతగా ఉంది. సినిమాకే హైలెట్​గా నిలుస్తుంది. మాటల్లో చెప్పలేను."

-ఉమైర్​ సంధు, సినీ విశ్లేషకుడు.

RadheShyam first review
RadheShyam first review

కాగా, రొమాంటిక్ లవ్​స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి వాయిస్ ఓవర్​​ ఇచ్చారు. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు స్వరపరచగా, తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ అందించారు. యూవీ క్రియేషన్స్- గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.

ఇదీ చూడండి: అదంతా ఓ మాయ.. అందుకే సినిమాల్లో ఉన్నాను: పూజాహెగ్డే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.