డార్లింగ్ ప్రభాస్(prabhas movies) గురించి అతడి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లో రొమాన్స్, ఫైట్, ఎమోషన్.. ఇలా దేనినైనా సరే బాగా చేస్తాడు. కానీ అదంతా ఆన్ స్క్రీన్ వరకు మాత్రమే. బయటమాత్రం చాలా తక్కువ మాట్లాడుతాడని, కాస్త సిగ్గరి అని.. ఇప్పటివరకు మనం ఎక్కడో ఓ చోట విన్నాం. కానీ అదంతా తెలియనివాళ్లు చెప్పే మాటలని హీరోయిన్ కృతిసనన్ చెప్పింది. వీరిద్దరూ 'ఆదిపురుష్' సినిమాలో(adipurush budget) కలిసి నటిస్తున్నారు.
"మీడియా రిపోర్ట్స్ ప్రకారం ప్రభాస్(prabhas movies) సిగ్గరి. కొత్త వారిని కలిసినప్పుడు కొంచెం బిడియంగానే ఉంటారు. కానీ అతడితో కొంత సమయం గడిపితే మాత్రం.. ప్రభాస్ ఎంత ఎక్కువ మాట్లాడుతాడో తెలుస్తుంది. అతడి పనిచేస్తే చాలా బాగుంటుంది" అని కృతిసనన్ చెప్పింది.

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న 'ఆదిపురుష్'లో(adipurush release date) ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. కృతిసనన్(kriti sanon new movie) సీత పాత్రలో కనిపించనుంది. ఇటీవల ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది.
ఈ సినిమాలో సన్నీ సింగ్, సైఫ్ అలీఖాన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఓం రౌత్ దర్శకుడు. వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందీ చిత్రం.
ఇవీ చదవండి:
- Radhe shyam teaser: 'రాధేశ్యామ్' టీజర్ వచ్చేస్తుందోచ్..
- Salaar Leaked: 'సలార్' సినిమాలోని ఫైట్ సీన్ లీక్!
- రష్మిక రికార్డు.. ప్రభాస్, విజయ్ దేవరకొండ కూడా ఈమె తర్వాతే
- రిలీజ్‌పై 'రాధేశ్యామ్' క్లారిటీ.. చెప్పిన తేదీకే
- Prabhas Pooja Hegde: పూజాహెగ్డే-ప్రభాస్‌కు మాటల్లేవా?
- Radheshyam: 'రాధేశ్యామ్'లో ఆ సీన్స్ హైలైట్!