ETV Bharat / sitara

'ఆదిపురుష్'​ క్రేజీ అప్డేట్​.. తెలుగులోకి మలయాళీ క్లాసిక్! - hrudayam remake

Prabhas Adipurush: కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. పాన్​ఇండియా స్టార్ ప్రభాస్​ నటించిన 'ఆదిపురుష్'​, సూర్య కొత్త చిత్రం సహా పలు సినిమాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

prabhas upcoming movie
Prabhas Adipurush
author img

By

Published : Mar 26, 2022, 7:46 AM IST

Prabhas Adipurush: రామాయణ ఇతిహాసం ఆధారంగా ఓం రౌత్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం 'ఆదిపురుష్‌'. ఇందులో ప్రభాస్‌ రాముడి పాత్రను పోషించగా.. జానకిగా కృతిసనన్‌ నటించింది. లంకేశ్వరుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకొంటోంది. దీన్ని వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడీ సినిమాకి కొనసాగింపుగా మరో చిత్రం తీసుకొచ్చేందుకు ఓం రౌత్‌ ప్రణాళిక రచిస్తున్నట్లు ప్రచారం వినిపిస్తోంది.

prabhas adipurush
'ఆదిపురుష్' టీమ్​

ఇప్పటికే ఈ ఆలోచన ప్రభాస్‌తో పంచుకోగా.. ఆయన సానుకూలంగా స్పందించారని టాక్‌. అన్నీ అనుకున్నట్లు కుదిరితే వచ్చే ఏడాదే ఈ సీక్వెల్‌ను పట్టాలెక్కించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్‌ 'ఆదిపురుష్‌'తో పాటు 'సలార్‌', 'ప్రాజెక్ట్‌ కె' చిత్రాల్లో నటిస్తున్నారు. సందీప్‌ రెడ్డి దర్శకత్వంలో 'స్పిరిట్‌' అనే చిత్రాన్ని ప్రకటించారు. అలాగే మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.

సూర్య మరో ప్రాజెక్ట్​ ఓకే..: వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు కథానాయకుడు సూర్య. ప్రస్తుతం ఆయన వెట్రిమారన్‌ దర్శకత్వంలో 'వాడివాసల్‌' సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే దర్శకుడు బాలాతో ఓ చిత్రం చేయాల్సి ఉంది. కాగా, ఇప్పుడాయన శివ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించినట్లు సమాచారం.

surya latest movie
సూర్య

ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్‌ నచ్చడం వల్ల ఈ ప్రాజెక్ట్‌కు సూర్య గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని తెలిసింది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక కొనసాగుతోందని, త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని ప్రచారం వినిపిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్‌ స్వరాలు సమకూర్చనున్నట్లు తెలుస్తోంది. శివ ఇటీవల రజనీకాంత్‌తో 'అన్నాత్తే' సినిమా చేశారు. ఇది తెలుగులో 'పెద్దన్న'గా విడుదలైంది.

హీరోయిన్​ లేకుండానే..: సుధీర్‌బాబు మరోసారి పోలీస్‌ పాత్రలో సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్‌ పతాకంపై ఇటీవలే ఓ చిత్రం ప్రారంభమైంది. మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వి.ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మాత. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమా చిత్రీకరణ సోమవారం నుంచి ప్రారంభం అవుతోంది.

sudheer babu latest movie
సుధీర్​బాబు

కథానాయిక లేని కథతో ఈ చిత్రం రూపొందుతోందని సినీ వర్గాలు తెలిపాయి. సీనియర్‌ నటుడు శ్రీకాంత్‌, 'ప్రేమిస్తే' భరత్‌ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కొత్త లుక్​లో..: ధనుష్‌ కథానాయకుడిగా సెల్వ రాఘవన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం 'నానే వరువేన్‌'. వి.క్రియేషన్స్‌ పతాకంపై కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా స్వరాలందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ను శుక్రవారం సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. ఆ ప్రచార చిత్రంలో ధనుష్‌ ఓ కుర్చీలో స్టైల్‌గా కూర్చొని కనిపించారు.

dhanush new movie
ధనుష్ కొత్త లుక్​

ఆసక్తికరమైన యాక్షన్‌ డ్రామా కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణలో ఉంది. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి.. ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగులో 'హృదయం' రీమేక్​..: కొత్తతరం ప్రేమకథతో రూపొందిన మలయాళ చిత్రం 'హృదయం' తెలుగులో రీమేక్‌ కానుంది. ప్రముఖ నిర్మాత కరణ్‌జోహార్‌ ఆ సినిమాకి సంబంధించిన హిందీ, తమిళం, తెలుగు రీమక్‌ హక్కుల్ని సొంతం చేసుకున్నారు. ఫాక్స్‌స్టార్‌ స్టూడియోస్‌తో కలిసి ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

hrudayam
'హృదయం'

మలయాళంలో మోహన్‌లాల్‌ తనయుడు ప్రణవ్‌, కల్యాణి ప్రియదర్శిని జంటగా నటించిన చిత్రమిది. అక్కడ చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది. మరి ఈ ప్రేమకథ తెలుగులో ఎవరిని వరిస్తుందో చూడాలి.

148నిమిషాల నిడివి..: కొవిడ్‌ మూడో వేవ్‌ తర్వాత హాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ క్రమంగా కోలుకుంటోంది. ఇప్పటికే జేమ్స్‌బాండ్‌ చిత్రం 'నో టైమ్‌ టు డై', 'స్పైడర్‌మ్యాన్‌', 'బ్యాట్‌మెన్‌' సినిమాలతో ప్రపంచ ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు వీరంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'డాక్టర్స్‌ స్ట్రేంజ్‌ ఇన్‌ ది మల్టీవర్స్‌ ఆఫ్‌ మ్యాడ్‌నెస్‌'. మే 6న ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం 2గంటల 28 నిమిషాల నిడివి ఉంటుందని సమాచారం.

dr strange 2 runtime
'డాక్టర్స్‌ స్ట్రేంజ్‌ ఇన్‌ ది మల్టీవర్స్‌ ఆఫ్‌ మ్యాడ్‌నెస్‌'

పలు రీషూట్‌లు, గ్రాఫిక్స్‌ వర్క్‌లతో నిడివి బాగా పెరిగిందనే ప్రచారం తొలుత వచ్చింది. అయితే దాన్ని చిత్రబృందం ఖండించింది. 148నిమిషాల నిడివితోనే ఫైనల్‌ కాపీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. బెనిడిక్ట్‌, ఎలిజిబెత్‌ ఓల్స్‌న్‌ నటిస్తున్న ఈ చిత్రాన్ని మార్వెల్‌ స్టూడియోస్‌ నిర్మిస్తోంది. సామ్‌ రైమి దర్శకుడు. 2016లో వచ్చిన 'డాక్టర్‌ స్ట్రేంజ్‌' సినిమాకు కొనసాగింపుగా వస్తున్న చిత్రమిది.

ఇదీ చూడండి: 'ఆర్​ఆర్​ఆర్​'కు కొత్త తలనొప్పులు.. రంగంలోకి మూవీ టీమ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.