ETV Bharat / sitara

'చిరంజీవి, చరణ్ వల్ల మా జీవితాలు మారిపోయాయి'

ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి సంధ్యారాజు నటించి, నిర్మించిన 'నాట్యం'(sandhya raju natyam movie) సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది(natyam movie release date). ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు సంధ్యారాజు.

Sandhya Raju
సంధ్యారాజు
author img

By

Published : Oct 20, 2021, 9:32 PM IST

ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి సంధ్యారాజు నటించి, నిర్మించిన 'నాట్యం'(sandhya raju natyam movie) సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది(natyam movie release date). రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్లకి మంచి స్పందన లభించింది. టాలీవుడ్‌ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకొంది. 'నాట్యం' విడుదల(natyam movie release date) సంద‌ర్భంగా హీరోయిన్ సంధ్యారాజు పంచుకున్న సినిమా కబుర్లు మీకోసం..

Sandhya Raju
సంధ్యారాజు

శ్వాస, ధ్యాస..నాట్యమే

చిన్నప్పటి నుంచి నాట్యం అంటే ప్రాణం. నా ఆలోచనలెప్పుడూ దాని చుట్టూనే తిరుగుతాయి. నాట్య ప్రదర్శనలు చేస్తే అభిరుచి ఉన్న కొద్దిమంది మాత్రమే చూస్తారు. సినిమా ద్వారా ఎక్కువమందికి చేరువుతుందనే ఈ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టాను. సినిమా ప్రపంచం పెద్దగా పరిచయం లేదు. నా ధ్యాస ఎప్పుడూ నాట్యం మీదే ఉండేది. నాట్యమే ప్రధానంగా కె. విశ్వనాథ్ లాంటి దర్శకులు గొప్ప చిత్రాలు చేశారు. నాట్యం అంటే కాళ్లు చేతులు మాత్రమే కదపడం కాదు. ఓ కథను చెప్పచ్చొనేది మా చిత్రంలో కనిపిస్తుంది. ‘నాట్యం’లో రెండు మూడు కథలు అంతర్లీనంగా ఉంటాయి. గురు శిష్యుల అనుబంధం, క్లాసికల్ డ్యాన్సర్లకు ఉండే హద్దులను చూపించే ప్రయత్నం చేశాం. ఇందులో సితార నాట్యకళాకారిణిగా కనిపిస్తాను. వెస్ట్రన్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్‌కు మధ్య ఉండే తేడా ఏంటి? ఇలా రెండు మూడు అంశాల చుట్టూ కథ తిరుగుతుంది. కమర్షియల్ సినిమాలా భారీగా రూపొందించాం.

Sandhya Raju
నాట్యం

మెగాస్టార్‌కు తెగ నచ్చింది

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సినిమా చూసి అభినందించారు. ఐదు నిమిషాలే చూస్తానని చెప్పి, సినిమా పూర్తయ్యే వరకు చూస్తూనే ఉండిపోయారు. మెగాస్టార్‌ చిరంజీవి సినిమాను ఇంకా చూడలేదు. సినీ నేపథ్యం నుంచి కాకుండా.. వ్యాపార రంగం నుంచి వచ్చి సినిమా నిర్మాణం చేపట్టడాన్ని ఆయన మెచ్చుకున్నారు. టీజర్ మెగాస్టార్‌కు బాగా నచ్చింది. పదేళ్లప్పుడు వెంపటి చినసత్యం గారి శిక్షణ కోసం వెళ్లి అక్కడే ఉండిపోయా. నా జీవితాన్ని కళలకే అంకితం చేయాలని నిర్ణయించుకున్నా. ఇంట్లోవారు కుటుంబ వ్యాపారాన్ని చూసుకోమనేవారు. నా మనసు నాట్యం మీదే ఉండిపోయింది. నా ఆసక్తిని గమనించి కుటుంబసభ్యులిచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. పెళ్లయ్యాక మెట్టింట్లోనూ నాకు అండగా నిలిచారు.

Sandhya Raju
సంధ్యారాజు

ఆదరిస్తే మరిన్ని చిత్రాలు

క్లాసికల్ డ్యాన్స్‌ తెలియని వాళ్లకీ ఆసక్తి కలిగే విధంగా సినిమాను రూపొందించాం. మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నిర్మాతగా, నటిగా వ్యవహరించడం కష్టమైన పని. అన్ని శాఖలను సమన్వయం చేస్తూ పనిచేశాను. షూటింగ్‌ పూర్తి చేసి థియేటర్‌లలో విడుదల చేయడం చాలా కష్టం. నాట్య ప్రదర్శనలను మెచ్చుకుంటే ఇంకా చేయాలనిపిస్తుంది. అలాగే ఈ సినిమాను ఆదరిస్తే.. ఇలాంటివి మరిన్ని చేసేందుకు ప్రోత్సాహం లభిస్తుంది.

Sandhya Raju
సంధ్యారాజు

ఆ మాటలే ధైర్యాన్నిచ్చాయి

మొదట నాట్యంని ఒక లఘుచిత్రంగా తీశాం. దానికి మంచి ఆదరణ లభించింది. చాలామంది అభినందించారు. షార్ట్ ఫిల్మ్ వల్ల మా జీవితాలు మారిపోయాయనే స్పందన విని కదిలిపోయా. అప్పుడే ఈ సినిమా చేయడానికి ధైర్యం వచ్చింది. నాట్య ప్రదర్శన ఇవ్వడానికి, కెమెరా ముందు నటించడానికి చాలా తేడా ఉంది. కథ, పాత్ర, మాటలు అర్థం చేసుకుని నటించాలి. కెమెరా కేవలం మన ముఖాలనే కాదు, మనలోని భావాలను కూడా పట్టేస్తుంది. ఆ శక్తి కెమెరాకు ఉంది.

Sandhya Raju
నాట్యం

కమర్షియల్‌ సినిమాలు చేయను

మలయాళంలో 'యూటర్న్' సినిమా చేశా. అంతగా ఆడలేదు. వేరే సినిమాల్లో అవకాశాలు వచ్చినా చేస్తా. కానీ కమర్షియల్ చిత్రాలు మాత్రం అంగీకరించను. మంచి కథ, పాత్రలకే తొలి ప్రాధాన్యం. జాతీయ అవార్డు సాధించే సత్తా ఉన్న పాత్రలు వస్తే చేయాలని ఉంది. మహిళా ప్రాధాన్య చిత్రాలు చేయాడానికే మొగ్గుచూపిస్తా. సినిమా పరిశ్రమ గురించి బయట ఏవేవో అంటారు. ఇక్కడ రాజకీయాలు ఎక్కువని చెబుతారు. కానీ చాలా మంచి వారున్నారు. మంచి కంటెంట్‌తో వస్తే ఆదరిస్తారు. అగ్రహీరోలు చిన్నవాళ్లను ప్రోత్సహిస్తున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ మాకోసం సమయం కేటాయించడం వల్ల జీవితమే మారిపోయింది. మా గురువు వెంపటి చినసత్యం గారు చేసినట్టు చేస్తే చాలని అంటున్నారు. కానీ ఆ తరంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆయనలా చేశారు. ఈ తరానికి తగ్గట్టుగా కూచిపూడి నాట్యంలో మార్పులు తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి: బన్నీ కాదు.. 'ఆర్య 3'లో హీరోగా విజయ్ దేవరకొండ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.