ETV Bharat / sitara

చైతూ-విక్రమ్​ల 'థ్యాంక్యూ' ప్రకటన వచ్చేసింది - థ్యాంక్యూ సినిమా

ఈరోజు 'మన్మథుడు' అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు నాగ చైతన్య. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

చైతూ-విక్రమ్​ల థ్యాంక్యూ ప్రకటన వచ్చేసింది

author img

By

Published : Aug 29, 2020, 12:27 PM IST

నాగ చైతన్య-విక్రమ్ కుమార్​ల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు వీరి నుంచి స్పందన రాలేదు. అయితే తాజాగా ఈరోజు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. నాగ్​కు బర్త్​డే విషెస్ తెలుపుతూ టైటిల్​ వెల్లడించారు.

ఈ సినిమాకు 'థ్యాంక్యూ' అనే టైటిల్ పెట్టారు. దిల్​రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. హీరోయిన్​తో పాటు మిగిలిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

ప్రస్తుత శేఖర్ కమ్ముల-నాగచైతన్య కాంబినేషన్​లో వస్తోన్న 'లవ్​స్టోరీ' చిత్రం తుదిదశకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత విక్రమ్​తో చిత్రాన్ని ప్రారంభించనున్నాడు చైతూ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.