మెగా డాటర్ నిహారిక పెళ్లి ప్రస్తుతం టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవలే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు బంధువులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. అలాగే ఈ వేడుకకు నిహారిక తన తల్లి పద్మ నిశ్చితార్థానికి కట్టుకున్న చీరలో మెరిసిపోయారు.
వీరి వివాహ వేడుక ఈనెల 9న జరగనున్న నేపథ్యంలో ఇరుకుటుంబాలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు బయలుదేరి వెళ్లాయి. దీనికి సంబంధించిన ఫొటోను వరుణ్ తేజ్ సామాజిక మాధ్యమాల ద్వారా పోస్ట్ చేశారు. ఇందులో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కుటుంబాలు కనిపించాయి.
నాగబాబు భావోద్వేగం
మరో రెండు రోజుల్లో తన కుమార్తె మరొక ఇంటికి కోడలుగా అడుగుపెట్టనున్న తరుణంలో నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు. "కుటుంబంగా నీకు మూలాలు అందించాం. నువ్వు ఎగరడానికి కావాల్సిన రెక్కలు తండ్రిగా ఇచ్చాను. ఆ రెక్కలు నిన్ను మరింత ఎత్తుకు తీసుకువెళ్తాయి. అలాగే ఆ మూలాలు నిన్ను ఎప్పుడూ సంరక్షిస్తూనే ఉంటాయి. నిన్ను ప్రేమించే తండ్రిగా నీకు అందించే రెండు అద్భుతమైన బహుమతులివే. లవ్ యూ నిహారిక" అంటూ పోస్ట్ పెట్టారు.