ETV Bharat / sitara

రోడ్డు ప్రమాదంలో యువ హీరో మృతి - Malayalam actor Basil George, 30, dies in road accident

మలయాళ యువహీరో బాసిల్​ జార్జ్​(30) రోడ్డు ప్రమాదంలో మరణించాడు. గతేడాది వచ్చిన 'పూవల్లియమ్​ కుంజడమ్'​ సినిమాతో అరంగేట్రం చేశాడీ నటుడు.

Malayalam actor Basil George, 30, dies in road accident
రోడ్డు ప్రమాదంలో యువ నటుడు మృతి
author img

By

Published : May 5, 2020, 5:20 PM IST

ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మలయాళ యువనటుడు బాసిల్​ జార్జ్​(30) మృతి చెందాడు. ఇతడితో పాటే ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. డ్రైవర్​ తప్పిదం వల్లనే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.

బాసిల్​తో పాటు నలుగురు స్నేహితులు.. కొలెన్​చెర్రీ నుంచి మువట్టుపుళకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. మార్గమధ్యమంలో మెక్కడంబు ప్రాంతంలో అదుపుతప్పి తొలుత కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు... ఆ తర్వాత పక్కనే ఉన్న భవంతిలోకి దూసుకెళ్లింది. సంఘటనా స్థలంలో ఇద్దరు మరణించగా, చికిత్స పొందుతూ జార్జ్ మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గతేడాది వచ్చి 'పూవల్లియమ్​ కుంజడమ్'​ సినిమాతో అరంగేట్రం చేశాడు జార్జ్​.

Malayalam actor Basil George, 30, dies in road accident
పూవల్లియమ్ కుంజడమ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.