పేరుప్రఖ్యాతలు తెచ్చుకునేందుకు తాను నటిగా మారలేదని చెబుతోంది బాలీవుడ్ భామ రాధిక ఆప్టే. మనం చేసే ప్రతి పని నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటామని అంటోంది. జీవితంలో కొన్నిసార్లు ప్రతికూలతలు ఎదురైనప్పుడు నిరాశ చెందకూడదని స్పష్టం చేసింది.
"పేరు, గుర్తింపు కోసం నేను చిత్రపరిశ్రమకు రాలేదు. కొన్నిసార్లు ఎవరైనా నన్ను ప్రోత్సాహిస్తే ఆనందిస్తాను. సినీప్రయాణంలో ఎదురయ్యే హిట్, ఫ్లాప్లను అసలు పట్టించుకోను. అవి కేవలం తాత్కాలికం. కొన్ని సందర్భాలలో వాటిని పక్కనపెట్టలేం. మీ ప్రయాణంలో ప్రశంసలు పొందడం, అవసరమైన సమయాల్లో వెన్ను తట్టే వారు ఉండటం చాలా ముఖ్యం. మనకు వచ్చే ప్రశంసలను ఇష్టపడాలి, వైఫల్యాల నుంచి కొన్ని నేర్చుకోవాలి.. నిరాశ చెందకూడదు. ఇలాంటి విషయాలను నేను బ్యాలెన్స్ చేసుకోగలను. రోజులు గడిచేకొద్ది అనేక విషయాలను నేర్చుకోవడం సహా నైపుణ్యాలను మీరు మెరుగుపరచుకోవచ్చు. మీరు తప్పులు చేయరని అనడం లేదు. కానీ, వాటి నుంచి కొత్త విషయాలను నేర్చుకుంటారని చెబుతున్నాను. నాకు తెలిసిన పనిని నిరంతరం సవాలుగా స్వీకరించి సంతృప్తి పొందుతున్నాను. వాటి నుంచి కొత్త చిక్కులు తెచ్చుకోను"
-రాధిక ఆప్టే, బాలీవుడ్ నటి
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రాధిక ఆప్టే..2005లో విడుదలైన 'వా! లైఫ్ హోతే ఐసీ' చిత్రంలో ఓ చిన్నపాత్ర ద్వారా బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత 'షోర్ ఇన్ ది సిటీ', 'కబాలి', 'ఫోబియా', 'బద్లాపూర్', 'అహల్య' (షార్ట్ఫిల్మ్)లో నటించి మెప్పించింది. 'ఫోబియా', 'బద్లాపూర్', 'మాంజీ: ది మౌంటైన్ మ్యాన్', 'లస్ట్ స్టోరీస్', 'సేక్ర్డ్ గేమ్స్', 'ప్యాడ్ మ్యాన్' చిత్రాలతో బాలీవుడ్ కొనసాగుతున్న మూస ధోరణిని బద్దలు కొట్టిన ఘనత ఈమెకు దక్కుతుంది! నెట్ఫ్లిక్స్లో ఇటీవలే విడుదలైన చిత్రం 'రాత్ అకేలీ హై'లో కీలకపాత్రలో కనిపించింది.