ETV Bharat / sitara

దివికేగిన గానగంధర్వుడు- ఎస్పీ బాలు అస్తమయం - ఎస్పీ బాలు మృతి

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(74) శుక్రవారం కన్నుమూశారు. ఆగస్టు 5న కరోనా సోకి ఆస్పత్రిలో చేరిన బాలు.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Legendary singer SP Balasubrahmanyam passes away
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇకలేరు
author img

By

Published : Sep 25, 2020, 1:42 PM IST

Updated : Sep 25, 2020, 2:07 PM IST

వేలాది పాటలతో కోట్లాది మందికి సంగీత మాధుర్యం పంచిన గానగంధర్వుడు దివికేగారు. దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(74) కన్నుమూశారు. కరోనా సోకి, తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన... చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 1.04గంటలకు తుదిశ్వాస విడిచారు.

ఆగస్టు 5న కొవిడ్​ సోకి, చెన్నైలోని ఎం​జీఎం ఆస్పత్రిలో ఎస్పీ బాలు చేరారు. ఆ విషయాన్ని ఆయనే సామాజిక మాధ్యమాల వేదికగా వీడియో పోస్ట్ చేసి చెప్పారు. రెండు రోజుల్లో కోలుకుని తిరిగొస్తానని అన్నారు. అయితే క్రమంగా ఆయన పరిస్థితి విషమించింది. ఎక్మో, వెంటిలేటర్​ ద్వారా వైద్యులు ప్రత్యేక చికిత్స అందించారు. బాలుకు సెప్టెంబర్​ 7న కరోనా నెగిటివ్​గా తేలింది. అయితే ఊపిరితిత్తుల ఇన్​ఫెక్షన్​ దృష్ట్యా ఎక్మో, వెంటిలేటర్​పై చికిత్స కొనసాగించారు వైద్యులు. ఫిజియోథెరపీ చేశారు. ఈ ప్రయత్నాలతో బాలు ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని ఆయన కుమారుడు చరణ్​ ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా అప్​డేట్స్​ ఇచ్చారు. త్వరలోనే ఎస్పీబీ డిశ్చార్జ్​ అవుతారని అంతా భావించారు. అయితే... అనూహ్యంగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించిందని గురువారం సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. కొద్దిగంటలకే కన్నుమూశారు బాలసుబ్రహ్మణ్యం.

ఎస్పీబీ ఇక లేరన్న వార్తతో సంగీతాభిమానులు విషాద సంద్రంలో మునిగిపోయారు. సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

Last Updated : Sep 25, 2020, 2:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.