ETV Bharat / sitara

అలాంటి వాడు భర్తగా రావాలి: కృతి - భర్త గురించి కృతి శెట్టి

'ఉప్పెన' చిత్రంతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది కృతి శెట్టి. అయితే ఈ సినిమాలో తన ప్రియుడిని కలిసేందుకు ఇంట్లో తండ్రితో తెగ అబద్ధాలు చెప్పే బేబమ్మ నిజ జీవితంలో ఎలాంటి వ్యక్తి భర్తగా రావాలని కోరుకుంటుందో చెప్పేసింది.

Kriti Shetty
కృతి శెట్టి
author img

By

Published : May 25, 2021, 8:11 AM IST

ఇప్పటి వరకూ చేసింది ఒకే సినిమా. అయితేనేం తన అందం, అభినయంతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది కృతి శెట్టి. కేవలం సినిమా ప్రేక్షకులనే కాదు ఎంతో మంది టాలీవుడ్‌ హీరోలను ఆకర్షించింది. అందుకే స్టార్‌ హీరోలు కూడా ఆమెతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన 'ఉప్పెన'లో వైష్ణవ్‌తేజ్‌కు జోడీగా కృతి శెట్టి సందడి చేసింది. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ఆ చిత్రం అటు ప్రేక్షకులను, ఇటు విమర్శకులనూ ఆకట్టుకుంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టి పలు రికార్డులు నెలకొల్పింది. అయితే.. సినిమాలో తన ప్రియుడిని కలిసేందుకు ఇంట్లో తండ్రితో తెగ అబద్ధాలు చెప్పే బేబమ్మ నిజ జీవితంలో ఎలాంటి వ్యక్తి భర్తగా రావాలని కోరుకుంటుందో చెప్పేసింది.

Kriti Shetty
కృతి శెట్టి

కృతికి అబద్ధాలు చెప్పేవారంటే అసలే నచ్చదట. అందుకే ఏ విషయమైనా దాపరికం లేకుండా ముక్కుసూటిగా చెప్పే వ్యక్తి తన జీవితంలోకి వస్తే బాగుంటుందని తన మనసులోని మాట బయటపెట్టేసింది. ఇంకా ఆమె పలు ఆసక్తికరమైన విషయాలు అభిమానులతో పంచుకుంది.

కృతిశెట్టికి ఒక్క సినిమాతోనే టాలీవుడ్‌ వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే నాని హీరోగా వస్తున్న ‘'శ్యామ్ సింగరాయ్‌', రామ్‌ పోతినేనితో, సుధీర్‌బాబుతో కలిసి 'ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది' చిత్రాల్లో నటించేందుకు కృతి సంతకాలు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.