ETV Bharat / sitara

Good luck sakhi trailer: ఈ 'సఖి'కి లైఫ్ అంతా బ్యాడ్​లక్! - keerthy suresh sarkaru vaari paata

Keerthy suresh good luck sakhi movie: కీర్తి సురేశ్​ 'గుడ్​లక్ సఖి' ట్రైలర్​ రిలీజైంది. ఇది, ఈ నెల 28న రానున్న సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది.

Good Luck Sakhi Trailer
గుడ్​లక్ సఖి మూవీ ట్రైలర్
author img

By

Published : Jan 24, 2022, 10:37 AM IST

ఇప్పటికే చాలాసార్లు వాయిదాపడిన కీర్తి సురేశ్ 'గుడ్​లక్ సఖి'.. జనవరి 28న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ట్రైలర్​ను సోమవారం రిలీజ్ చేశారు. ఆద్యంతం నవ్విస్తున్న ఈ ట్రైలర్.. సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

ఇందులో గిరిజిన యువతిగా కీర్తి సురేశ్ నటించింది. షూటింగ్​లో ఓనమాలు తెలియని ఓ యువతి.. జాతీయ స్థాయి షూటర్​గా ఎలా ఎదిగింది? ఇందులో ఎదుర్కొన్న ఆటుపోట్లేంటి అనే కథతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో కీర్తి సురేశ్​తోపాటు జగపతిబాబు, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. జాతీయ అవార్డు గ్రహీత నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కీర్తి మరో సినిమా ఓటీటీలో?

కరోనా వచ్చిన తర్వాత కీర్తి సురేశ్ నటించిన పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ఓటీటీలోనే విడుదలయ్యాయి. ఇప్పుడు తను నటిస్తున్న 'సాని కాయిదమ్' కూడా ఇదే బాట పట్టనున్నట్లు సమాచారం. ఈ సినిమా ఏప్రిల్​లో అమెజాన్ ప్రైమ్​లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ ప్రధాన పాత్ర పోషించారు.

saani kaayidham amazon prime
సాని కాయిదమ్ మూవీ ఓటీటీ రిలీజ్

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.