ETV Bharat / sitara

నాది 'ఐరన్ లెగ్' అని అన్నారు: హీరోయిన్ కీర్తి సురేశ్ - keerthy suresh sarkaruvaari paata movie

Keerthy suresh movies: కెరీర్​ ప్రారంభంలో తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానని హీరోయిన్ కీర్తిసురేశ్ చెప్పింది. ఒకటి, రెండు సినిమాలు మొదలై, ఆగిపోయేసరికి తనది ఐరన్ లెగ్ అని అన్నట్లు తెలిపింది.

keerthy suresh
కీర్తి సురేశ్
author img

By

Published : Jan 29, 2022, 6:31 AM IST

Keerthy suresh goodluck sakhi: ఓ కొత్త హీరోయిన్ తెరపై మెరిసిందంటే చాలు.. ఆ చిత్ర ఫలితాన్ని బట్టి వారిపై ఓ ముద్ర పడిపోతుంది. తొలి అడుగుల్లోనే వరుస విజయాలు దక్కాయంటే సరేసరి.. లేదంటే హిట్టు మాట వినిపించే వరకు 'ఐరన్‌ లెగ్‌' అన్న ముద్ర మోసుకుతిరగాల్సిందే. ఇప్పుడు చిత్రసీమలో స్టార్‌ నాయికలుగా వెలుగులీనుతున్న పలువురు నాయికలు కెరీర్‌ ఆరంభంలో ఇలాంటి విమర్శల్ని ఎదుర్కొన్న వారే. ఇందుకు తాను కూడా మినహాయింపు కాదంటోంది నటి కీర్తి సురేశ్.

ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తాను కూడా 'ఐరన్‌ లెగ్‌' అన్న ట్యాగ్‌ను మోయాల్సి వచ్చిందని చెప్పింది. "నాయికగా నా సినీ ప్రయాణం మలయాళ చిత్రసీమ నుంచి మొదలైంది. నా తొలి చిత్రం సెట్స్‌పైకి వెళ్లిన కొద్దిరోజులకే అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత మరో రెండు సినిమాల విషయంలోనూ ఇదే జరిగింది. ఇలా నా సినిమాలన్నీ మధ్యలోనే ఆగిపోవడంతో కొంతమంది నాపై 'ఐరన్‌ లెగ్‌' ముద్రవేశారు. 'ఆ కొత్తమ్మాయిని పెట్టుకుంటే సినిమా ఆగిపోతుంది' అని ప్రచారం చేశారు. ఆ సమయంలో కాస్త బాధగా అనిపించినా.. వాటిని పట్టించుకోకుండా నా పని చేస్తూ ముందుకెళ్లాను. ఆ తర్వాత నా పని తీరే నాకు విజయాన్ని అందించింది. దాంతో నాపై వచ్చిన విమర్శలన్నీ ఒక్కసారిగా చెదిరిపోయాయి" అని కీర్తి చెప్పింది.

ఆమె నటించిన 'గుడ్‌లక్‌ సఖి' ఇటీవలే విడుదలైంది. తెలుగులో మహేశ్ బాబుతో 'సర్కారు వారి పాట', చిరంజీవితో 'భోళా శంకర్‌' చిత్రాల్లో నటిస్తోంది కీర్తి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.