ETV Bharat / sitara

Kamal Haasan covid: కరోనా నుంచి కోలుకున్న కమల్​ హాసన్​ - కమల్​ హాసన్​ సినిమాలు

Kamal Haasan corona: ప్రముఖ నటుడు కమల్​హాసన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఈ మేరకు ఆస్పత్రి యాజమాన్యం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.

Kamal Haasan recovered from covid
కరోనా నుంచి కోలుకున్న కమల్​ హాసన్
author img

By

Published : Dec 1, 2021, 3:13 PM IST

Updated : Dec 1, 2021, 6:09 PM IST

Kamal Haasan news: దిగ్గజ నటుడు కమల్​హాసన్​ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది. డిసెంబర్ 3 వరకు ఐసోలేషన్​లోనే ఉండనున్నట్లు స్పష్టం చేసింది. 4 నుంచి కమల్​ తన రోజూవారీ పనులు చేసుకోవచ్చని పేర్కొంది.

నవంబరు 22న కమల్​ హాసన్​కు కరోనా సోకింది. అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్న తర్వాత​ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యిందని కమల్​ ట్వీట్​లో తెలిపారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

త్వరలోనే కమల్​.. 'విక్రమ్'​ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. లోకేశ్​ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్​సేతుపతి, ఫహాద్​ ఫాజిల్​ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీతో పాటు శంకర్​ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన 'ఇండియన్​ 2'లోనూ కమల్​ నటించనున్నారు. ఇప్పటికే షూటింగ్​ ప్రారంభించుకున్న ఈ సినిమా తాత్కాలికంగా నిలిచిపోయింది.

ఇదీ చదవండి:Sirivennela died: సిరివెన్నెల చనిపోవడానికి కారణాలు ఇవే

రోడ్డు ప్రమాదంలో తెలుగు హీరో సోదరుడు మృతి

Last Updated : Dec 1, 2021, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.