ETV Bharat / sitara

నొప్పి భరిస్తూనే ఈ స్టార్స్ నటిస్తున్నారు..!

కొందరు సినిమా తారల జీవితం బయటకు కనిపించినంత అందంగా ఉండదు! అందుకు ఉదాహరణే ఈ స్టోరీ. ఇంతకీ ఆ స్టార్స్ ఎవరు? వాళ్లకున్న సమస్యేంటి? తదితర విషయాలు మీకోసం.

cinema stars with health problems
స్టార్స్ హెల్త్ ప్రాబ్లమ్స్
author img

By

Published : Oct 28, 2021, 1:27 PM IST

సినిమా తారలది రాజవైభోగం. కోరినవన్నీ క్షణాల్లో వాళ్ల ముందుంటాయి. చిన్న సమస్య కూడా ఉండదు. జబ్బుల బారిన పడరు. ఇలా ఎన్నో అనుకుంటాం. కానీ, వాళ్లూ మనలాంటి మనుషులే. వాళ్లకూ ఆరోగ్య సమస్యలుంటాయి. ఆ బాధను పంటి బిగువున భరిస్తూనే మనకు వినోదం పంచుతుంటారు. కానీ, వాళ్లకున్న ఆరోగ్య సమస్యల్ని బయటపెట్టడానికి ఇష్టపడరు. ఇటీవల బాలీవుడ్‌ నటి యామీ గౌతమ్‌ 'కెరాటోసిస్‌ పిలారిస్‌'తో బాధ పడుతున్నానని ధైర్యంగా చెప్పింది. తనది చర్మ సమస్య. ఇంతకన్నా పెద్ద, చిన్న సమస్యలు ఎదుర్కొన్న కొందరు తారల వివరాలు.

షారూఖ్‌ ఖాన్‌- మానసిక ఒత్తిడి

చాలామందిలాగే బాలీవుడ్‌ బాద్‌షా షారుక్.. కొన్నాళ్లు తీవ్ర మానసిక ఒత్తిడికిలో కూరుకుపోయాడు. 'దిల్‌వాలే' సినిమా షూటింగ్‌ సమయంలో కండరాల్లో చీలికలొచ్చాయి. కొన్ని నెలలపాటు బాధతో విలవిల్లాడిపోయేవాడు. ఈ బాధను తట్టుకోలేక నేను తిరిగి కోలుకుంటానో, లేదో అనే ఒత్తిడితో డిప్రెషన్‌కు లోనయ్యాడు. కొన్నాళ్లు చికిత్స తీసుకున్న తర్వాత ఆ ఒత్తిడి నుంచి బయటికొచ్చాడు. ఈ సమయంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు, అభిమానుల ఆశీస్సులే తిరిగి ఆరోగ్యవంతుడిని కావడానికి కారణమని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

.
.

ఇలియానా - బాడీ డిస్మార్ఫిక్‌ డిజార్డర్‌

'నేనేం అందంగా లేను', 'నాలో చాలా లోపాలున్నాయి' అనుకుంటూ తనలో తనే కొన్నేళ్లపాటు బాధను అనుభవించింది ఎవరో తెలుసా? తన అందంతో కుర్రకారుకి నిద్ర కరువు చేసిన ఇలియానా. చివరికి ఇది మానసిక ఒత్తిడికి దారి తీసిందట. కుటుంబం, స్నేహితుల అండతో ఆ సమస్య నుంచి బయటపడ్డానని ఓ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది ఇలియానా.

.
.

రజనీకాంత్‌-బ్రాంకైంటిస్‌

దక్షిణాది సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ 2011లో 'ఎమెసిస్‌' అనే అనారోగ్య సమస్యతో బాధపడ్డారు. అంటే తీసుకున్న ఆహారం కడుపులోకి చేరిన వెంటనే వాంతుల రూపంలో మళ్లీ బయటికి రావడం అన్నమాట. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దీనికి చికిత్స తీసుకుంటున్న సమయంలోనే బ్రాంకైటిస్‌ బారినపడ్డారు. ఈ సమస్యతో బాధ పడుతూ కొన్నాళ్లు ఐసీయూలో కూడా ఉన్నారు. సింగపూర్‌లో చికిత్స తీసుకున్న తర్వాత కోలుకున్నారు.

.
.

సోనాలీ బింద్రే- క్యాన్సర్‌

'ఖడ్గం' హీరోయిన్‌ సోనాలీ బెంద్రే 2018లో మెటస్టాటిక్‌ క్యాన్సర్‌ బారిన పడింది. అది తీవ్రం కావడం వల్ల అమెరికా వెళ్లి చికిత్స తీసుకుంది. ఐదు నెలలపాటు రోగంతో పోరాడి ప్రాణాలు కాపాడుకుంది. తర్వాత క్యాన్సర్‌ వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాని బారిన పడితే ఏం చేయాలనేదానిపై ప్రచారం చేస్తోంది.

.
.

సోనమ్‌ కపూర్‌- మధుమేహం

ఫ్యాషన్‌ ఐకాన్‌గా ఉన్న సోనమ్‌కపూర్‌ టీనేజీ నుంచే డయాబెటీస్‌తో బాధ పడిందనే విషయం చాలామందికి తెలియదు. తను అప్పట్లో చాలా లావుగా ఉండేది. కానీ క్రమం తప్పని వ్యాయామం, ఆహారం విషయంలో నియంత్రణ పాటించడం వల్ల నాజూగ్గా మారింది.

.
.

స్నేహ ఉల్లాల్‌- ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌

మనల్ని రోగాల బారి నుంచి కాపాడాల్సిన రక్షణ వ్యవస్థే శత్రువులా మారి దాడి చేస్తే? ఉల్లాసంగా.. ఉత్సాహంగా, కరెంట్‌, సింహా లాంటి సినిమాలతో తెలుగువారికి దగ్గరైన భామ స్నేహా ఉల్లాల్‌ కెరీర్‌ ఊపందుకుంటున్న దశలో ఇదే జబ్బుతో బాధ పడింది. దీర్ఘకాలిక చికిత్స తీసుకోవడంతో కొన్నాళ్లపాటు నటనకే దూరం కావాల్సి వచ్చింది.

.
.

కమల్‌ హాసన్‌- మధుమేహం

జగమెరిగిన నటుడు కమల్‌హాసన్‌ టైప్‌-1 డయాబెటీస్‌తో బాధ పడుతున్నాడు. అతి దాహం, అతి మూత్రం, చిరాకు, అనారోగ్య సమస్యలు..ఈ జబ్బుతో ఎన్ని బాధలో. వాటన్నింటినీ అనుభవిస్తూనే అత్యుత్తమ నటన ఇస్తున్నాడు.

.
.

నయనతార- చర్మ సమస్య

అభిమానులకు మరింత అందంగా కనిపించాలని సినిమా తారలు మేకప్‌ వేసుకోవడం సహజమే. నయనతార కూడా అందుకు మినహాయింపేం కాదు.. కొన్నాళ్లవరకు తనకు దాంతో ఇబ్బందేం కలగలేదు. కానీ 'వల్లవన్‌' సినిమా చేస్తున్నప్పుడు మేకప్‌ వేసుకుంటే చర్మంపై విపరీతమైన దద్దుర్లు వచ్చాయి. ఆ ఇబ్బంది తట్టుకోలేక షూటింగ్‌ సైతం రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది అరుదైన చర్మ సమస్యగా తేలింది. ముఖ్యంగా మాంసాహారం తిన్నప్పుడు ఈ సమస్య తీవ్రంగా ఉండేదట. ఇంగ్లిష్‌ మందులతోపాటు ఏడాదిన్నరపాటు కేరళ ఆయుర్వేద మందులు వాడిన తర్వాత కోలుకుంది నయన్‌.

.
.

అమితాబ్‌ బచ్చన్‌- మ్యాస్తేనియా గ్రావిస్‌

బిగ్‌ బీ అమితాబ్‌ పలురకాల అనారోగ్య సమస్యలతో కొన్నిసార్లు చావు అంచులదాకా వెళ్లొచ్చారు. 1984లో మ్యాస్తేనియా గ్రావిస్‌ అనే జబ్బు బారినపడ్డారు. ఇది శారీరకంగా, మానసికంగా ఒంటిని గుల్ల చేసే రోగం. పలురకాల మందులు వాడి దీన్నుంచి కోలుకున్నారు. 2000లో క్షయ వ్యాధి సోకింది. వీటన్నింటికన్నా ముందు 1982లో కూలీ సినిమా షూటింగ్‌ సమయంలో ప్రమాదానికి గురైన తర్వాత 'లివర్‌ సిర్రోసిస్‌' అనే కాలేయ వ్యాధితో బాధ పడ్డాడు.

.
.

సమంత- పాలీమార్ఫస్‌ లైట్‌ ఎరప్షన్‌

కొంచెం ఎండ వేడి తగలగానే చర్మంపై దురద మొదలవుతుంది. మంట పుడుతుంది. పది నిమిషాలకు మించి ఎండలో ఉండలేరు. ఇదీ 2012లో మన సమంత పరిస్థితి. ఫెయిర్‌ స్కిన్‌ ఉన్నవాళ్లలో కొందరికి ఎదురయ్యే సమస్య ఇది. దాదాపు రెండేళ్లపాటు దీంతో సతమతమైంది సామ్‌.

.
.

దీపికా పదుకొణె- మానసిక ఒత్తిడి

చేతి నిండా డబ్బులు, స్టార్‌ హీరోయిన్‌ హోదా.. ఇవేవీ దీపికా పదుకొనేని మానసిక ఒత్తిళ్ల నుంచి బయట పడేయలేకపోయాయి. ఆరేడేళ్ల కిందట ప్రేమ వైఫల్యాలు, పని ఒత్తిడితో తీవ్ర మానసిక కుంగుబాటుకు గురైంది దీపిక. దాన్నుంచి బయటపడటానికి కౌన్సెలింగ్‌ తీసుకుంది.

.
.

సల్మాన్‌ ఖాన్‌- ట్రిగెమినల్‌ న్యూరాల్జియా

ఆన్‌స్క్రీన్‌, ఆఫ్‌స్క్రీన్‌లో ఫుల్‌ జోష్‌తో ఆకట్టుకునే సల్లూభాయ్‌ ఇప్పటికీ ట్రిగెమినల్‌ న్యూరాల్జియా అనే సమస్యతో సతమతమవుతున్నాడు. బాధను పంటి బిగువున అనుభవిస్తూనే ఉన్నాడు. ఈ సమస్య కారణంగా సల్మాన్‌ దవడ, చెక్కిళ్ల భాగంలో తరచూ విపరీతమైన నొప్పి వస్తుండేది. దీనికోసం అమెరికా వెళ్లి చికిత్స తీసుకున్నాడు. ప్రస్తుతానికి నొప్పి తీవ్ర తగ్గింది అంటున్నాడు.

.
.

మనీషా కోయిరాలా- అండాశయ క్యాన్సర్‌

ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించిన వెటరన్‌ మనీషా కోయిరాలా 2012లో అండాశయ క్యాన్సర్‌ బారిన పడింది. అయినా ఏమాత్రం కుంగిపోలేదు. న్యూయార్క్‌ వెళ్లి కొన్ని నెలలపాటు చికిత్స తీసుకుంది. తర్వాత పూర్తి ఆరోగ్యవంతురాలైంది. తర్వాత మహిళా హక్కుల చైతన్యం కోసం కొన్ని స్వచ్ఛందసంస్థలతో కలిసి పని చేస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.