ETV Bharat / sitara

లైంగిక వేధింపుల వల్ల ఇండస్ట్రీకి హీరోయిన్ గుడ్​బై - ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు

సినిమాలు, సీరియల్స్​ చేస్తున్నప్పుడు, కొందరు వ్యక్తుల నుంచి లైంగిక వేధింపులు ఎదురుకావడం వల్లే నటనకు దూరమయ్యానని వెల్లడించారు నటి కల్యాణి.

లైంగిక వేధింపుల వల్ల ఇండస్ట్రీకి హీరోయిన్ గుడ్​బై
నటి కల్యాణి
author img

By

Published : Jun 1, 2020, 7:20 AM IST

ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖుల నుంచి లైంగిక వేధింపులు ఎదురవడం వల్లే తాను నటనకు దూరమయ్యానని తమిళ నటి కల్యాణి చెప్పారు. తమిళంలో తెరకెక్కిన 'జయం', 'అలై తండా వానమ్‌', 'ఎస్‌ఎంఎస్‌' సినిమాలతోపాటు తెలుగులో 'మళ్లీ మళ్లీ' చిత్రంలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలు, సీరియల్స్‌తో ప్రేక్షకులను మెప్పించిన ఆమె.. కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఈ విషయంపై ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

'ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలోనే ప్రభుదేవాతో కలిసి 'అలై తండా వానమ్‌' సినిమాలో నటించాను. అలా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించాను. అయితే హీరోయిన్‌గా మంచి అవకాశాలు వస్తోన్న తరుణంలో కొత్త మంది వ్యక్తుల నుంచి మా అమ్మకు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. సినిమాల్లో నటించాలంటే కొన్ని విషయాల్లో నేను సర్దుకుపోవాలని వాళ్లు అన్నారు. సదరు వ్యక్తుల మాటలతో సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాను. కొంతకాలానికి బుల్లితెరలో నటించడానికి అవకాశాలు వచ్చాయి. అలా పలు సీరియల్స్‌లో నటించి బుల్లితెరలో పేరు తెచ్చుకున్నా. అయితే అక్కడ కూడా లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. దాంతో నేను నటనకు పూర్తిగా దూరమయ్యాను. ప్రస్తుతం కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నాను' అని కల్యాణి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.