ప్రస్తుతం స్వీయ నిర్బంధానికి మీరు నటించిన ఏ హీరోతో గడపడానికి ఇష్టపడతారని అడిగిన ప్రశ్నకు కథానాయిక పూజాహెగ్డే సమాధానమిచ్చింది. తాను కలిసి నటించిన నటులలో ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక ప్రత్యేకత ఉందని.. దాన్ని నేర్చుకుంటానని అంటోది ఈ భామ. అయితే ప్రత్యేకంగా ఒక్కరినే ఎంచుకోవాలంటే మాత్రం హృతిక్ రోషన్‌ను ఎంచుకుంటానంటోంది. ఎందుకంటే తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన తన కలల రాకుమారుడని చెప్పుకొచ్చింది.
స్వీయ నిర్బంధ జీవితంలో మీతో కలిసి గడిపే అవకాశం మీ హీరోల్లో ఒకరికి ఉందంటే వాళ్లలో ఎవరిని ఎంచుకుంటారు?వాళ్ల నుంచి ఏం నేర్చుకుంటారు?
పూజా హెగ్డే: నాకిది చాలా కష్టమైన ప్రశ్నే. నేను ఇప్పటివరకూ కలిసి నటించిన మహేష్‌బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, వరుణ్‌తేజ్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ ప్రతిఒక్కరూ ఎవరికి వారు అనేక అంశాల్లో చాలా ప్రతిభావంతులే. అందుకే నాకిలాంటి అవకాశమొస్తే అందరినీ స్వీయ నిర్బంధంలోకి తీసుకోని, వారి నుంచి అనేక నైపుణ్యాలు నేర్చుకోవాలనుకుంటా. ప్రత్యేకంగా ఒక్కరినే అంటే మాత్రం.. హృతిక్‌ను ఎంచుకుంటా. చిన్నప్పటి నుంచి తను నా కలల హీరో. అదృష్టవశాత్తూ బాలీవుడ్‌లో నా తొలి చిత్రాన్ని ఆయనతోనే చేశా. ఆయన అనేక విషయాల్లో నాకు స్ఫూర్తిగా నిలుస్తుంటారు. తనని స్వీయ నిర్బంధంలోకి తీసుకుంటే.. రోజూ ఉదయం లేవగానే ఆయన అందాన్ని ఆస్వాదిస్తూ గడుపుతా. వ్యాయామం చేయడం, ఆహరపు అలవాట్లు, డ్యాన్స్ విషయాల్లో ఆయన నుంచి ఎన్నో మెళకువలు నేర్చుకుంటా.
ఇదీ చూడండి.. 'కరోనా.. నీవల్ల మా హీరో రాక ఆలస్యమైంది'