ETV Bharat / sitara

OTT Release: ఈ వారం విడుదల కానున్న సినిమాలివే.. - నువ్వుంటే నా జతగా సినిమా

అభిమానుల ఆనందాన్ని పెంచేందుకు మరికొన్ని సినిమాలు​.. ఈ వారం ఓటీటీ విడుదలకు సిద్ధమయ్యాయి. 'నవరస' వెబ్​ సిరీస్​, 'నువ్వుంటే నా జతగా' తెలుగు చిత్రంతో పాటు పలు వెబ్​సిరీస్​లూ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Hot Movies and Web Series on OTT Coming up this week
OTT Release: ఈ వారం విడుదల కానున్న సినిమాలివే..
author img

By

Published : Aug 1, 2021, 7:32 PM IST

సినీ అభిమానుల్ని అలరించేందుకు ఓటీటీలో ఈ వారం(ఆగస్టు 1-6)లో సరికొత్త సినిమాలు, సిరీస్​లు విడుదల కానున్నాయి. అందులో 'నవరస' వెబ్​సిరీస్​ సహా అనేక చిత్రాలు ఉన్నాయి. ఇంతకీ అవేంటి? ఏ ఓటీటీ యాప్​లో రిలీజ్​ కానున్నాయో తెలుసుకుందాం.

నవరస (తమిళం)

Hot Movies and Web Series on OTT Coming up this week
నవరస

కోలీవుడ్​ స్టార్స్ సూర్య, విజయ్​ సేతుపతి, సిద్ధార్థ్, అరవిందస్వామి, అశోక్​ సెల్వన్​ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్​సిరీస్​ 'నవరస'. ఈ సిరీస్​ను నెట్​ఫ్లిక్స్​తో కలిసి దర్శకుడు మణిరత్నం నిర్మిస్తున్నారు. మనిషిలోని ప్రధాన హావభావాలు కోపం, కరుణ, ధైర్యం, అసహ్యం, భయం, నవ్వు, ప్రేమ, శాంతి, ఆశ్చర్యం వంటి వాటిని ప్రధానంగా చేసుకుని రూపొందించిన వెబ్​సిరీస్​ ఇది. నెట్​ఫ్లిక్స్​లో ఆగస్టు 6న విడుదల కానుంది.

నువ్వుంటే నా జతగా(తెలుగు)

నువ్వుంటే నా జతగా

రాజశేఖర్​ అనిగి, శ్రీకాంత్​ బీరోజు, రఫీష్క కలిసి నటించిన చిత్రం 'నువ్వుంటే నా జతగా'. సంజయ్​ కార్లపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 2న అమెజాన్​ ప్రైమ్​ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ మధ్యతరగతి కుటుంబంలో జరిగిన యాధార్థ సంఘటనలు ఆధారంగా రూపొందిన చిత్రమిది.

డయల్​ 100 (హిందీ చిత్రం)

డయల్​ 100

బాలీవుడ్​ నటీనటులు మనోజ్​ భాజ్​పాయ్​, నీనా గుప్తా, సాక్షి తన్వర్​ కలిసి నటించిన చిత్రం 'డయల్​ 100'. రెన్సిల్ డిసిల్వా దర్శకత్వంలో రూపొందిన ఈ థ్రిల్లర్​ డ్రామా జీ5 ఓటీటీలో ఆగస్టు 6 నుంచి స్ట్రీమింగ్​ కానుంది.

ప్రే అవై (ఇంగ్లీష్​ డాక్యుమెంటరీ)

ప్రే అవై

ట్రిబెకా ఫిల్మ్​ ఫెస్టివల్​లో ఉత్తమ డాక్యుమెంటరీగా నామినేషన్ పొందిన 'ప్రే అవై'.. నెట్​ఫ్లిక్స్​లో ఆగస్టు 3వ విడుదల కానుంది. 'కన్వర్షన్​ థెరపీ' ఉద్యమం ఆధారంగా రూపొందిన ఈ డ్యాక్యుమెంటరీని ర్యాన్​ మర్ఫీ రూపొందించారు.

ది సూసైడ్​ స్క్వాడ్​ (ఇంగ్లీష్​ సినిమా)

ఎస్​.ఓ.జడ్​. సోల్డర్స్​ ఆర్​ జాంబీస్​

మార్గొట్​ రాబీ, ఇడ్రీస్​ ఇల్బా, జాన్​సీనా, సిల్వస్టర్​ స్టాలోన్​ కలిసి నటించిన చిత్రం 'ది సూసైడ్​ స్క్వాడ్​'. జేమ్స్​ గన్​ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 5న హెచ్​బీవో మ్యాక్స్​ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మిస్టర్​.కార్మన్​ (ఇంగ్లీష్​ వెబ్​సిరీస్​)

మిస్టర్​.కార్మన్​

జోసెఫ్ గోర్డాన్-లెవిట్, ఆర్టురో కాస్ట్రో నటించిన వెబ్​సిరీస్​ మిస్టర్​. కార్మన్​.. ఆగస్టు 6 నుంచి ఆపిల్​ టీవీ+లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. జోసెఫ్​ గోర్డాన్​-లెవిట్​ దర్శకత్వంలో రూపొందిన ఈ అమెరికన్​ వెబ్​సిరీస్​ ఓ స్కూల్​ నేపథ్యంలో రూపొందింది.

ఎస్​.ఓ.జడ్​. సోల్డర్స్​ ఆర్​ జాంబీస్​ (వెబ్​సిరీస్​)

సెర్గియో పెరిస్-మెంచెటా, ఫాతిమా మోలినా, హోరాసియో గార్సియా రోజాస్ కలిసి నటించిన వెబ్​సిరీస్​ 'ఎస్​.ఓ.జడ్​. సోల్డర్స్​ ఆర్​ జాంబీస్'. రిగోబెర్టో కాస్టనేడా దర్శకత్వంలో రూపొందిన ఈ సెన్స్​-ఫిక్షన్​ యాక్షన్​ సిరీస్​ అమెజాన్​ ప్రైమ్​ ఓటీటీ వేదికగా ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి.. ఐశ్వర్యరాయ్, దీపికా పదుకొణె.. తల్లి కాబోతున్నారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.