ETV Bharat / sitara

ఈ సెలబ్రిటీ భార్యభర్తలు అల్లరే అల్లరి - లాక్​డౌన్​ వేళ పాయల్​ రాజ్​పుత్​ వీడియో

లాక్​డౌన్​ కారణంగా ఇళ్లకే పరిమితమైన పలువురు సెలబ్రిటీలు.. దొరికిన ఈ కొద్ది సమయాన్ని, నచ్చిన వ్యాపకాలతో గడిపేస్తున్నారు. నటి శ్రియ, తన భర్తతో కలిసి అల్లరి చేస్తూ కనిపించింది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

Heroines are spending their time with their interests during lockdown time
ఈ భార్యాభర్తల అల్లరి చూశారా..?
author img

By

Published : Apr 11, 2020, 12:59 PM IST

కరోనా ప్రభావంతో‌ విధించిన లాక్‌డౌన్‌ సమయాన్ని జాలీగా గడుపుతోంది నటి శ్రియ. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఈమె.. భర్త ఆండ్రూతో ఇంటికే పరిమితమైంది. ఈ ఖాళీ సమయంలో ఆతడితో కలిసి తెగ అల్లరి చేస్తోంది. ఆ వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది.

తాజాగా ఇన్‌స్టా‌లో పోస్ట్‌ చేసిన ఓ వీడియో అలరిస్తోంది. కాగితంపై రాసిన కొన్ని వాక్యాలను శ్రియ కెమెరాకు చూపిస్తుండగా.. వెనక ఆండ్రూ, భార్య రాసిన వాటికి కౌంటర్‌ వేస్తున్నట్లున్న కాగితాలను ఇందులో చూపించాడు.

  • 'సామాజిక దూరాన్ని పాటిద్దాం' అని రాసున్న కాగితాన్ని శ్రియ చూపించగానే వెనక నుంచి వచ్చిన ఆండ్రూ.. 'తను ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది' అని రాసున్న కాగితాన్ని పట్టుకున్నాడు.
  • 'క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు' అని రాసున్న కాగితాన్ని శ్రియ పట్టుకోగా.. ఆండ్రూ చూపించిన కాగితంలో.. 'నాతో రోజంతా పని చేయిస్తోంది' అని రాసుంది.
  • చివరగా 'ఇంట్లోనే ఉండండి' అని రాసున్న కాగితాన్ని శ్రియ చూపించగా.. 'ఆమె నుంచి నన్ను కాపాడండి' అని రాసున్న కాగితాన్ని ఆండ్రూ కెమెరాకు చూపించాడు.

కళ్లు మాట్లాడుతున్నాయి!

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ టచ్‌లో ఉండే హీరోయిన్లలో పాయల్‌ రాజ్‌పుత్‌ ఒకరు. 'ఆర్‌ఎక్స్‌100' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది.. తన అందంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. తాజాగా ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ చేసిన కొన్ని పాయల్ ఫొటోలు అభిమానుల మదిని దోచేస్తున్నాయి.

ఓ అందమైన ఫొటోను తలకిందులుగా పోస్ట్‌ చేసి.. 'కళ్లు మాట్లాడుతున్నాయి' అనే వ్యాఖ్యను జోడించింది పాయల్‌.

ఇక వెనక్కి తిరిగి చూస్తున్న మరో ఫొటోను పంచుకుంటూ.. 'దేని వైపూ చూడట్లేదు. కానీ త్వరలోనే మంచి రోజులు రానున్నాయి' అని రాసుకొచ్చింది.

పెట్‌ లవ్‌!

చేసినవి కొన్ని సినిమాలే అయినా, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది తెలుగమ్మాయి అంజలి. చక్కటి కథల్ని ఎంచుకుంటూ తనదైన శైలిలో ముందుకు దూసుకెళుతోంది. లాక్‌డౌన్‌ సమయాన్ని ఇంట్లోనే జాలీగా గడుపుతోందీ బ్యూటీ. తన పెంపుడు శునకంతో ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్న అంజలి.. 'మనలోని ఉత్సాహం ఇతరులనీ ప్రభావితం చేస్తుంది' అనే అర్థం వచ్చేలా ఓ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది.

వారందరికీ మనఃపూర్వక ధన్యవాదాలు!

యావత్‌ ప్రపంచాన్ని కరోనా భయపెడుతోన్న నేపథ్యంలో ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే మనల్ని రక్షించేందుకు ఎంతో మంది వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు మాత్రం బయట విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి వారందరికీ కృతజ్ఞత చెప్పడం మనందరి బాధ్యత.

తాజాగా ఇదే విషయాన్ని చెప్పింది అందాల తార సోనాక్షీ సిన్హా. కాగితంపై రంగురంగుల స్కెచ్‌లతో 'దిల్‌ సే థాంక్యూ (మనఃపూర్వక ధన్యవాదాలు)' అని రాస్తున్న సమయంలో తీసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.

'ఈ విపత్కర సమయం నుంచి ఎప్పుడు బయటపడతామా? అని మనమంతా ఇంట్లో జాగ్రత్తగా ఉంటూ ఎదురుచూస్తుంటే.. వైద్యులు, పోలీసు అధికారులు, వాలంటీర్లు, ప్రభుత్వ అధికారులు మాత్రం కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్నారు. మనందరి మేలు కోరి వారు చేస్తోన్న ఈ కృషికి వారికి మనఃపూర్వక ధన్యవాదాలు (దిల్‌ సే థ్యాంక్యూ)' అని రాసుకొచ్చిందీ బ్యూటీ.

ఇదీ చూడండి : 'కరోనా అంతమైన తర్వాత ఈ చిన్నారిలా గెంతుతా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.