ETV Bharat / sitara

ఇప్పటికీ అలా చేయాలంటే సిగ్గు: శ్రీ విష్ణు

తన దగ్గరకు వచ్చిన ప్రతి కథను రియలిస్టిక్​గా తీసేందుకు ప్రయత్నిస్తానని అన్నారు హీరో శ్రీ విష్ణు. అదే తన బలమని చెప్పారు. ఆయన నటించిన 'అర్జున ఫల్గుణ'.. డిసెంబర్ 31న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో సినిమా సహా వ్యక్తిగతం జీవితం గురించి ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

arjuna phalguna movie
శ్రీ విష్ణు
author img

By

Published : Dec 30, 2021, 6:43 AM IST

యూట్యూబ్‌ షార్ట్‌ ఫిల్మ్స్‌తో కెరీర్‌ ప్రారంభించాడు.. సినిమాల మీద ఉన్న ఆసక్తితో వెబ్‌ డిజైనర్‌ జాబ్‌ వదులుకున్నాడు.. 'ప్రేమ ఇష్క్‌ కాదల్‌', 'ఉన్నది ఒకటే జిందగీ', 'బ్రోచేవారెవరురా'తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అతడే శ్రీవిష్ణు. ఈ ఏడాది రెండు చిత్రాలు 'గాలి సంపత్‌', 'రాజ రాజ చోర'తో ప్రేక్షకులను పలకరించిన ఆయన.. డిసెంబర్‌ 31న 'అర్జున ఫల్గుణ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఆ చిత్ర విశేషాలను మీడియాతో ముచ్చటించాడు.

arjuna phalguna movie
శ్రీ విష్ణు

అందుకే 'అర్జున ఫల్గుణ' చేయడానికి ఒప్పుకున్నా..

ఈ ఏడాదిలో వస్తున్న నా మూడో చిత్రం ఇది. ఇప్పటి వరకు కొత్త దర్శకులతోనే పనిచేశా. మంచి కథతో దర్శకులు వస్తే.. అన్నీ దగ్గరుండి నేనే చూసుకుంటా. మొదటి సారి దర్శకుడు తేజ మర్ని కథ చెప్పినప్పుడు సినిమా బాగా తెరకెక్కించగలడన్న నమ్మకం కలిగింది. ఎమోషన్ సీన్స్ హత్తుకునేలా రాశారు. వాస్తవానికి భావోద్వేగాలను బాగా చూపించగలిగితే సినిమా వర్కవుట్ అవుతుంది. అందుకే సినిమా ఓకే చేశా. చాలా తక్కువ సమయంలో (55 రోజుల్లో) షూటింగ్ పూర్తి చేసి తేజ ఆశ్చర్యపరిచారు. వాస్తవానికి అలా చేయడం చాలా కష్టం. కచ్చితంగా తేజ పెద్ద డైరెక్టర్ అవుతారు.
అలా ఈ సినిమా పేరు పెట్టాం..

'అర్జున ఫల్గుణ' అనేది భారతంలోని టాపిక్. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటీ, కృష్ణ, విజయ.. ఇలా ఓ పది పేర్లు తలుచుకుంటే ధైర్యం వస్తుందని పురాణాల్లో చెప్పారు. కానీ రాను రాను అది 'అర్జున ఫల్గుణ' వరకే ఉండిపోయింది. ఉరుములు, మెరుపులు, పిడుగులు వస్తే అందరూ 'అర్జున ఫల్గుణ' అని అనుకోమనేవారు. కానీ కొన్ని పేర్లు విన్నప్పుడు, తలుచుకున్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది. అలా 'అర్జున ఫల్గుణ' అనే పేరులో ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. ఈ సినిమాకు ముందుగా వేరే పేరు అనుకున్నాం. కానీ అది కుదరలేదు. ఒకరోజు వర్షంలో కూర్చుని డైరెక్టర్, నేను మాట్లాడుకున్నాం. అలా ఈ టైటిల్ వచ్చింది.

arjuna phalguna movie
'అర్జున ఫల్గుణ'

చాలా ఫ్రెష్‌గా అనిపించింది..

దర్శకుడు తేజని కలిసినప్పుడు తన తొలి చిత్రం 'జోహార్' సినిమా ఇంకా రాలేదు. 'ఆర్టాస్' అనే కూల్ డ్రింక్ అనే పాయింట్ కేవలం తూర్పు, పశ్చిమ గోదావరి వాళ్లకు మాత్రమే తెలుసు. నాకు ఇంకా అవి గుర్తున్నాయి. గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్‌లో కథ చేయాలని అనుకున్నా. ఊరి బ్యాక్ డ్రాప్‌లోంచి సిటీకి వచ్చిన కథలు చేశా. కానీ మొత్తం ఊరి బ్యాక్ డ్రాప్‌లో చేయలేదు. ఇది చాలా ఫ్రెష్‌గా అనిపించింది. పూర్తి కథను సిద్ధం చేయమని చెప్పా.

ఐదుగురు స్నేహితుల కథ..

మేం ఐదుగురం ఫ్రెండ్స్. ఆ పేర్లలో ఫస్ట్ లెటర్స్‌తో 'ఆర్టాస్' అని వస్తుంది. ఇంతకు ముందు అయితే ఆర్టాస్ కూల్‌డ్రింక్‌ కంపెనీలో పని చేసే కుర్రాళ్ల కథ. కానీ అది కుదరలేదు. అందుకే సోడా మీదకు కథ మార్చేశాం. డిగ్రీ అయిపోయి ఊర్లోనే ఉంటూ సంపాదించుకుందామనే కుర్రాళ్ల కథ. సిటీకి వెళ్లి పాతిక వేలు సంపాదించేకంటే.. ఊర్లో ఉండి పది వేలు సంపాదించుకుని తల్లిదండ్రులను బాగా చూసుకుంటే చాలని అనుకునే మనస్తత్వంతో ఉంటారు. నర్సీపట్నంలో జరిగిన ఘటనల ఆధారంగానే ఈ సినిమాను తీశాం.

arjuna phalguna movie
'అర్జున ఫల్గుణ'

వెటకారం మాములుగా ఉండదు..

ఇది వరకు చాలా సినిమాల్లో గోదావరి యాసలో మాట్లాడాను. కానీ ఇప్పుడు పూర్తిగా గోదావరి యాసలోనే ఉంటుంది. ఇది కరెక్ట్ స్లాంగ్. ఈ సినిమాలో యాస పరంగా ఎలాంటి హద్దుల్లేవు. పూర్తిగా వెటకారంగా ఉంటుంది.

అందుకే ఫీమేల్ కారెక్టర్‌ను స్ట్రాంగ్‌గా చూపిస్తా..

ట్రైలర్‌లో గ్రామ వాలంటీర్ల గురించి తప్పుగా వెళ్లింది. అలా కట్ చేశాం కాబట్టి అలా అనిపించింది. నా ప్రతి సినిమాల్లో ఫీమేల్ కారెక్టర్‌ను స్ట్రాంగ్‌గా చూపిస్తా. ఇందులో కూడా అలానే ఉంటుంది. మా ఐదుగురిలో ఎవరికీ ఉద్యోగం రాకుండా ఆ అమ్మాయికి మాత్రమే వస్తుందన్న కడుపు మంటతో అలా మాట్లాడతారు. వివాదమనిపిస్తే, నిజంగానే ఎవరైనా హర్ట్ అవుతారని అనిపించినా.. నేనే ముందుగా సీన్లు తీసేయమని అంటా.

arjuna phalguna movie
'అర్జున ఫల్గుణ' నటీనటులు

ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పుకునే అవకాశం...

తెలుగు హీరోలందరినీ నేను ఆరాధిస్తా. అందరినీ ఇష్టపడతా. పెద్ద ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇలా అందరినీ గొప్పగా చూస్తుంటా. మన హీరోలను గౌరవించుకునే అవకాశం వస్తే దాన్ని వాడుకుంటా. వాళ్లంతా గొప్ప వాళ్లు కాబట్టే స్టార్లు అయ్యారు. నాకు ఈ సినిమాలో ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పుకునే అవకాశం వచ్చింది. ఇందులో ఎంతో పాజిటివ్‌గా ఉంటుంది.

ఆ సీన్లు అద్భుతంగా వచ్చాయి..

మన దగ్గర అనుమతులు త్వరగా రాదని ట్రైన్ ఎపిసోడ్ కోసం ఒడిశా వెళ్లాం. రెండు రోజుల వరకే షూటింగ్ చేసుకుంటామంటే ఇచ్చింది ఒక రోజే. అందులోనూ కరెక్ట్‌గా రెండున్నర గంటలే దొరికింది. అందులోనూ మేం గట్టిగా వాడింది గంటన్నర మాత్రమే. చాలా కష్టపడి సీన్లు తీసేశాం. బ్రిడ్జ్ దగ్గర సీన్లు అద్భుతంగా వచ్చాయి. బ్రిడ్జ్ దగ్గర పరిగెత్తే సీన్లలో కిందకు మాత్రం చూడొద్దన్నారు. కానీ మధ్యలోకి వెళ్లాక చూశాను. ఒక్కసారిగా భయమేసింది.

arjuna phalguna movie
'అర్జున ఫల్గుణ'లో శ్రీ విష్ణు

అదేంటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తారు..

తెలుగు టైటిల్స్ అంటే నాకు చాలా ఇష్టం. టైటిల్స్‌ అన్నీ తెలుగులో పెట్టేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతుంటా. అలా మధ్య మధ్యలో సంస్కృత పదాలు కూడా పెడుతుంటా. ఈ తరం వాళ్లకు అర్జున ఫల్గుణ అనేది ఎవ్వరికీ తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఒకరో ఇద్దరూ దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. 'అర్జున ఫల్గుణ'లో అద్భుతమైన ఎమోషన్స్ ఉంటాయి. పద్ధతులు, సంప్రదాయాలు చూపిస్తాం. ఫ్రెండ్స్ మధ్య ఉండే ఎమోషన్ బాగా ఉంటుంది. సినిమా ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే 'ముల్కల లంక' అనే ఊర్లోకి వెళ్తారు. నేను, 'రంగస్థలం' మహేశ్‌, 'మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌'లో చైతన్య, 'రాజవారు రాణివారు'లో చౌదరి అనే అబ్బాయి, అమృత.. మా ఐదుగురు చుట్టూ కథ తిరుగుతుంది. మా అందరి పాత్రలు సమానంగా ఉంటాయి. నరేష్‌, శివాజీ రాజా, సుబ్బరాజు.. ఇలా ఎవరి పాత్ర ఎవరికి వారు అద్భుతంగా చేశారు. బహుశా దర్శకుడు తేజ ఎవరి దగ్గరికి వెళ్లినా నువ్వే హీరో అని కథ చెప్పి ఉంటాడు (నవ్వులు). అందుకే వాళ్లకి వాళ్లు హీరోగా అనుకొని సినిమాల్లో ఇరగదీశారు.

అవే నా బలం..

రియలిస్టిక్ సినిమాలు చేయడం అంత ఈజీ కాదు. కెరీర్‌లో ఒకటో రెండో రియలిస్టిక్ కథలు వస్తాయి. కానీ నా దగ్గరకు వచ్చిన ప్రతి కథనూ రియలిస్టిక్ చేసేందుకు ప్రయత్నిస్తా. నా సినిమాలన్నీ నేచురల్‌గా ఉంటాయని అందరూ అంటుంటారు. రియలిస్టిక్‌ కథలే నా బలం.

కొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తుంటా..

సినిమాల్లో పెద్దగా ప్రయోగాలు ఏమీ చేయలేదు. నార్మల్ కథనే కాస్త కొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తుంటా. 'తిప్పరా మీసం' సినిమాను బాగా నమ్మాం. అమ్మ సెంటిమెంట్‌తో ఆ సినిమా చేశా. అంతకు ముందే 'బ్రోచేవారెవరురా' అంటూ ఫుల్ కామెడీ సినిమా చేశా. అందుకే 'తిప్పరా మీసం' కూడా ఎక్కువ సరదాగా ఉంటుందని అనుకున్నారు. కానీ అది పూర్తిగా మదర్ సెంటిమెంట్‌తో ఉంటుంది. కానీ నా వరకు అదే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన చిత్రం. ప్రియదర్శన్ అనే కొత్త అబ్బాయి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సుధీర్ రాసిన డైలాగ్స్ ఎంతో రియలిస్టిక్‌గా అనిపిస్తాయి. డైలాగ్స్ రాసినట్టు ఎక్కడా అనిపించవు.

arjuna phalguna movie
శ్రీ విష్ణు, అమృత అయ్యర్

పెద్ద సినిమాల హవా ఇప్పట్లో తగ్గదు..

కరోనా సమయంలోనే థియేటర్లలో 'రాజ రాజ చోర' కూడా విడుదల చేశాం. ఒమిక్రాన్ వస్తుందంటే మనం ఏం చెప్పలేం. ఇక పెద్ద సినిమాల హవా ఇప్పట్లో తగ్గదు. మాకు కనీసం ఓ వారం సోలోగా దొరికిందని సంతోషంగా ఉన్నాం. కొత్త ఏడాదిని ఇలా పాజిటివ్ సినిమాతో ప్రారంభిస్తే బాగుంటుందని అనిపించింది. ఇది కరెక్ట్ సీజన్. ముందు డిసెంబర్ మొదటి రెండు వారాల్లో అనుకున్నాం. కానీ చివరకు ఇలా డిసెంబర్ 31న వస్తున్నాం.

అదేంటో ఇప్పటికీ అలా చేయడమంటే సిగ్గు..

నాలో అపరిచితుడు ఉన్నాడు. మంచి కథను చెప్పి షూటింగ్‌ స్పాట్‌లో యాక్షన్‌ అన్నారంటే అప్పుడొస్తాడు (నవ్వులు). బయటలా రిజర్డ్వ్‌గా ఉన్నట్టు అనిపించినా సెట్‌లో మాత్రం జోవియల్‌గా ఉంటా. అందులో నా స్వార్థం కూడా ఉంది. నాకు కొంచెం మొహమాటం ఎక్కువ. అలవాటైతే మాత్రం ఫ్రెండ్లీగా ఉంటా. అందరూ ఒకరకంగా పాజిటివ్‌గా అనుకుంటే మరికొంత మంది నెగెటివ్‌ అనుకుంటారు. ఇప్పటికీ నాకు కెమెరాల ముందు ఫొటోల ముందు పోజులు ఇవ్వాలంటే సిగ్గు (నవ్వులు). చిన్నప్పటి నుంచి నాకు మొహమాటం ఎక్కువ. సాధారణంగా ఇండస్ట్రీకి వస్తే మొహమాటం పోతుందంటారు నాకు మాత్రం ఇంకా పోలేదు.

ఇవే తదుపరి చిత్రాలు..
'భళా తందనానా' అనే చిత్రం చేస్తున్నా. లక్కీ మీడియాలో ప్రదీప్‌ వర్మ అనే కొత్త డైరెక్టర్‌తో మరో సినిమా చేస్తున్నా. ఇది ఓ పోలీస్‌ ఆఫీసర్‌ బయోపిక్‌. ఇండియాలోని నలుగురైదుగురు ది బెస్ట్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ ఎపిసోడ్స్‌ని తీసుకొని ఫిక్షనల్‌ బయోపిక్‌లా తీస్తున్నాం. అందులో ఐదు ఏజ్‌ గ్రూప్స్‌ ఉంటాయి. ఇంతకంటే ఈ సినిమాల గురించి ఎక్కువగా ఏమీ చెప్పలేను.

ఇదీ చూడండి: 'ఇండస్ట్రీకి వచ్చాక ఆ విషయం అర్థమైంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.