ETV Bharat / sitara

Kalyan Ram: కల్యాణ్​రామ్ దూకుడు.. ఒకేసారి ఐదు సినిమాలతో - telugu movie updates

కథానాయకుడు కల్యాణ్​రామ్ టాప్​గేర్​లో దూసుకెళ్తున్నారు. ఐదు విభిన్న తరహా సినిమాలు చేస్తున్నారు. ఇందులో కొన్ని ఇప్పటికే షూటింగ్ జరుపుకొంటుండగా, మరికొన్ని త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

hero kalyan ram crazy movie lineup
కల్యాణ్​రామ్ మూవీ న్యూస్
author img

By

Published : Jul 5, 2021, 5:25 PM IST

హీరో నందమూరి కల్యాణ్​రామ్​.. యమ దూకుడు మీదున్నారు. సినిమా చేయడంలో గేర్ ​మార్చి, ఫుల్ స్పీడ్​లో దూసుకుపోతున్నారు. ఏకంగాఐదు సినిమాలు చేస్తూ, ఇతర కథానాయకులకు అందనంత దూరంలో ఉన్నారు. అయితే ఈ చిత్రాల్లో వేటికవి విభిన్న కథలు కావడం మరో విశేషం. ఇంతకీ ఆ సినిమాలేంటి? వాటి సంగతేంటి?

చారిత్రక 'బింబిసార'

కల్యాణ్​రామ్​ తొలిసారిగా నటిస్తున్న పీరియాడికల్ డ్రామా 'బింబిసార'. ఇందులో మగద సామ్రాజ్య రాజుగా కల్యాణ్​రామ్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన లుక్స్ అంచనాల్ని పెంచడం సహా చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అనే ఉత్సుకతను కలిగిస్తోంది. వశిష్ట్ దర్శకుడు.

kalyanram Bimbisara movie
కల్యాణ్​రామ్ బింబిసార మూవీ

మైత్రీ మూవీస్​తో కల్యాణ్ రామ్-#NKR19

తెలుగు స్టార్ హీరోలతో సినిమాలు తీస్తున్న మైత్రీమూవీ మేకర్స్.. కల్యాణ్​రామ్ 19వ చిత్రాన్ని నిర్మిస్తుంది. #NKR19 వర్కింగ్ టైటిల్​తో తీస్తున్న ఈ సినిమాకు రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఇతర వివరాలు వెల్లడించే అవకాశముంది.

kalyan ram mythri movie makers
కల్యాణ్​రామ్ - మైత్రీ మూవీ మేకర్స్

అచ్చొచ్చిన దర్శకుడితో మళ్లీ- #NKR20

'118' లాంటి మిస్టరీ థ్రిల్లర్​ కోసం కలిసి పనిచేసిన కల్యాణ్​రామ్-కేవీ గుహన్.. ఇప్పుడు మరోసారి సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈసారి క్రైమ్​ థ్రిల్లర్​ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దిల్​రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీనికి 'ఏజెంట్ వినోద్' టైటిల్​ కూడా అనుకుంటున్నట్లు సమాచారం.

kalyan ram kv guhan
కల్యాణ్​రామ్ కేవీ గుహన్ మూవీ

డెవిల్​గా కల్యాణ్​రామ్ -#NKR21

కల్యాణ్​రామ్ నటిస్తున్న మరో విభిన్న తరహా చిత్రం 'డెవిల్'. ఇందులో బ్రిటిష్ సీక్రెట్​ ఏజెంట్​గా నటిస్తున్నారు. కల్యాణ్​రామ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్​తో పాటు ఫస్ట్​లుక్​ను సోమవారం విడుదల చేశారు. వీటిని చూసిన అభిమానులు.. అప్పుడు సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు! దీనికి నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు.

KALYANRAM DEVIL MOVIE
కల్యాణ్​రామ్ డెవిల్ మూవీ

నిర్మాత మహేశ్​తో మరోసారి-#NKR22

కల్యాణ్​రామ్ తన 22వ సినిమాను ఈస్ట్​కోస్ట్ ప్రొడక్షన్స్​ నిర్మాణంలో చేయనున్నారు. ఈ బ్యానర్​లో ఇంతకు ముందు '118' చేశారు. ఇప్పుడు ఇంకెలాంటి తరహా చిత్రం చేస్తారో చూడాలి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

KALYAN RAM EAST COAST PRODUCTIONS MOVIE
కల్యాణ్​రామ్ 22వ సినిమా

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.