ETV Bharat / sitara

పుట్టినరోజున చరణ్ భావోద్వేగం.. అతడే తన గౌరవమన్న చిరు - గౌతమ్ తిన్ననూరి

Happy Birthday Ramcharan: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్'​తో మరోసారి ఇండస్ట్రీ హిట్​ అందుకున్నారు తారక్-రామ్​చరణ్. నేడు (మార్చి 27) రామ్​చరణ్ పుట్టినరోజు కావడం వల్ల ఈ విజయం చెర్రీకి మరింత ప్రత్యేకంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఓ భావోద్వేగ పోస్టు పెట్టారు చరణ్. మరోవైపు మెగాస్టార్​ చిరంజీవి కూడా తన పుత్రోత్సాహాన్ని పంచుకున్నారు.

ram charan new movie
happy birthday ramcharan
author img

By

Published : Mar 27, 2022, 10:49 AM IST

Updated : Mar 27, 2022, 1:31 PM IST

Happy Birthday Ramcharan: స్టార్‌ హీరో రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు ఆయన ఎన్టీఆర్‌తో కలిసి నటించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' మంచి విజయం అందుకోవడం వల్ల ఈ పుట్టినరోజు చెర్రీకి మరింత స్పెషల్‌గా మారింది. ఈ క్రమంలో అభిమానులు చూపిస్తున్న ప్రేమ పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఓ సందేశాన్ని పంచుకున్నారు.

happy birthday ramcharan
చరణ్​ పోస్ట్

"ఎస్‌ఎస్‌ రాజమౌళిగారి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు హృదయ పూర్వక ధన్యవాదాలు. ఎంతో ఉత్సాహంగా ఈ సినిమా చూసిన అందరికీ నా కృతజ్ఞతలు. ఈ అపూర్వమైన పుట్టినరోజు బహుమానాన్ని బాధ్యతతో స్వీకరిస్తాను" అని చరణ్ ట్వీట్‌ చేశారు.

చరణే నా గౌరవం: చిరంజీవి

happy birthday ramcharan
చిరుతో చెర్రీ

మరోవైపు చిరంజీవి కూడా చరణ్‌కు విషెస్‌ చెబుతూ అరుదైన చిత్రాన్ని పంచుకున్నారు. "రామ్‌చరణ్‌కు సోషల్‌మీడియా ద్వారా బర్త్‌డే విషెస్‌ చెప్పటం నాకు వింతగా అనిపిస్తోంది. అయితే, శుభ సందర్భంలో చరణ్‌కు సంబంధించిన ఫొటో షేర్‌ చేస్తే అభిమానులు ఆనందిస్తారనిపించింది. కొడుకుగా చరణ్‌ నేను గర్వపడేలా చేశాడు. అతడే నా గౌరవం" అని చిరంజీవి ట్వీట్‌ చేశారు.

ram charan new movie
'ఆచార్య'లో చెర్రీ

చరణ్​ చిత్రాల పోస్టర్లు..

తండ్రి చిరంజీవితో కలిసి చరణ్‌ నటించిన 'ఆచార్య' విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. దిల్‌ రాజు నిర్మాత. దీని తర్వాత గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు. యూవీ క్రియేషన్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది.

ram charan new movie
శంకర్​ మూవీలో చరణ్
ram charan new movie
'ఆర్​సీ16'

ఇదీ చూడండి: చరణ్​ చేతుల మీదుగా 'కేజీఎఫ్​2' ట్రైలర్​.. రిలీజ్​ డేట్​తో రామ్​

Last Updated : Mar 27, 2022, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.