ETV Bharat / sitara

ఈ కథ విన్నప్పుడు తెలియకుండానే ఏడ్చేశా: రజనీకాంత్ - rajinikanth annaatthe movie collections

'అన్నాత్తే'(తెలుగులో 'పెద్దన్న')(rajinikanth annaatthe movie) డైరెక్టర్​ శివపై ప్రశంసలు వర్షం కురిపించారు ఆ సినిమా హీరో రజనీకాంత్(rajinikanth latest movie). ఈ చిత్రంలో తను నటించడం వెనకున్న అసలు విషయాన్ని వెల్లడించారు.

Rajinikanth
రజనీకాంత్
author img

By

Published : Nov 16, 2021, 10:55 AM IST

సూపర్​స్టార్ రజనీకాంత్.. 'పెద్దన్న'(rajinikanth latest movie) అంటూ ప్రేక్షకులను ఇటీవల పలకరించారు. అయితే ఈ సినిమాను జీవితంలో తాను అస్సలు మర్చిపోలేనని, డైరెక్టర్​ శివ తొలుత ఈ సినిమా కథ చెబుతున్నప్పుడు తెలియకుండానే ఏడ్చేశానని రజనీ అన్నారు. అలానే పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. తన కుమార్తె సౌందర్య(rajinikanth family) ఈ మధ్య లాంచ్​ చేసిన 'హూటే' యాప్​లో రజనీ.. ఈ సందర్భంగా రెండు వాయిస్​ మెసేజ్​లు పోస్ట్ చేశారు.

Rajinikanth Annaatthe
పెద్దన్న సినిమాలో రజనీకాంత్

శివ గత చిత్రం 'విశ్వాసం'. రజనీకాంత్ 'పేటా'తో(petta songs) పాటే థియేటర్లలో రిలీజైంది. ఆ సమయంలోనే 'విశ్వాసం' రజనీకి తెగ నచ్చేసిందట. దీంతో డైరెక్టర్​ శివను తలైవా కలవాలనుకున్నారు. దీంతో అతడిని తన ఇంటికి పిలిపించారు.

సినిమా చేసే విషయమై శివతో మాట్లాడగా.."మీకు హిట్​ ఇవ్వడం చాలా సులభం సర్" అని తనతో శివ అన్నట్లు రజనీ అప్పటి విషయాన్ని గుర్తుచేసుకున్నారు. తనతో ఇప్పటివరకు ఏ డైరెక్టర్​ కూడా అలా అనలేదని అన్నారు. అయితే హిట్​ ఇస్తా అని ఎలాంటి నమ్మకంతో చెబుతున్నావని అనగా.. "మంచి కథతో పాటు గ్రామీణ నేపథ్యంలో మీరు సినిమా తీసి చాలా రోజులైంది. ఆ రెండు ఉంటే సినిమా కచ్చితంగా హిట్​ అవుతుంది" అని శివ తనతో అన్నాడని రజనీ చెప్పారు.

Rajinikanth Annaatthe
పెద్దన్న సినిమాలో రజనీకాంత్

తనను కలిసిన 20 రోజుల తర్వాత శివ పూర్తి స్క్రిప్ట్​తో వచ్చాడని రజనీ చెప్పారు. దాదాపు రెండున్నర గంటలపాటు తనకు నెరేషన్ ఇచ్చాడని, వెంటనే అన్నాత్తే(తెలుగులో 'పెద్దన్న')(peddanna rajinikanth) స్క్రిప్ట్​కు గ్రీన్ సిగ్నల్​ ఇచ్చానని రజనీ అన్నారు.

అయితే శివ ఈ కథ చెబుతున్న సమయంలో తెలియకుండానే ఏడ్చేశానని రజనీ గుర్తుచేసుకున్నారు. 'చాలా బాగుంది.. నువ్వు చెప్పినట్లు తీయ్ చాలు' అని శివతో చెప్పానని రజనీ అనగా.. "ఇంతకంటే బాగా తీస్తాను. ప్రేక్షకులు చాలామంది వచ్చి ఈ సినిమా చూస్తారు" అని శివ తనతో అన్నాడని తెలిపారు. ఎన్ని సమస్యలు ఎదురైనా సరే శివ నవ్వుతో వాటిని అధిగమించాడని రజనీ చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.