Emma Heesters Srivalli Song: సంగీతానికి భాషతో సంబంధం లేదు. హృదయాన్ని హత్తుకునే రాగాన్ని ఎవరు స్వర పరిచినా అది విశ్వవ్యాప్తం అవుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఎందరో సంగీత దర్శకులు, గాయకులు ఈ విషయాన్ని నిరూపించారు. ఇప్పుడు డచ్ గాయని ఎమ్మా హీస్టర్స్... ఇదే నిజమనిపిస్తోంది.
-
Loved this🎶❤️🎶
— DEVI SRI PRASAD (@ThisIsDSP) February 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Hey @sidsriram bro,I told U when we recorded,lets do an English version 4 Fun,but here’s a lovely cover by @emmaheesters 😎🎶😍
May be we shud do our version too🎤 @alluarjun @aryasukku @javedali4u @boselyricist @adityamusic @TSeries https://t.co/9K3qAD4o1H
">Loved this🎶❤️🎶
— DEVI SRI PRASAD (@ThisIsDSP) February 5, 2022
Hey @sidsriram bro,I told U when we recorded,lets do an English version 4 Fun,but here’s a lovely cover by @emmaheesters 😎🎶😍
May be we shud do our version too🎤 @alluarjun @aryasukku @javedali4u @boselyricist @adityamusic @TSeries https://t.co/9K3qAD4o1HLoved this🎶❤️🎶
— DEVI SRI PRASAD (@ThisIsDSP) February 5, 2022
Hey @sidsriram bro,I told U when we recorded,lets do an English version 4 Fun,but here’s a lovely cover by @emmaheesters 😎🎶😍
May be we shud do our version too🎤 @alluarjun @aryasukku @javedali4u @boselyricist @adityamusic @TSeries https://t.co/9K3qAD4o1H
డచ్ సింగర్ నోట.. శ్రీవల్లి పాట
అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం పుష్పలోని శ్రీవల్లి పాటని ఇంగ్లిష్‌లో తనదైన శైలిలో పాడి సంగీత శ్రోతల్ని విశేషంగా అలరిస్తోంది. చూపే బంగారమాయనే శ్రీవల్లి.. మాటే మాణిక్య మాయనే అని తెలుగులోనూ ఆలపించి ఫిదా చేస్తోంది. ఈ పాటకు స్వరాలు సమకూర్చిన దేవిశ్రీ ప్రసాద్ ఎమ్మా వీడియోను ట్విటర్ వేదికగా పోస్ట్ చేస్తూ ఆమె ప్రతిభను మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎమ్మా హీస్టర్స్ పాటని విన్నవాళ్లంతా.. పాట చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు.
నెదర్లాండ్స్‌కు చెందిన ఎమ్మాకు చిన్నప్పటి నుంచే సంగీతంపై మక్కువ. తల్లి సంగీత అధ్యపకురాలు కావడంతో.. ఆమె దగ్గరే సంగీత పాఠాలు నేర్చుకుంది.. ఈ యువతి. చిన్నప్పటి నుంచి సంగీతానికి దగ్గరగా పెరగడంతో సంగీతంపై మంచి పట్టు సాధించింది. చదువు పూర్తయ్యాక స్వయంగా కవర్ సాంగ్స్ చేయటం ప్రారంభించింది.. ఎమ్మా హీస్టర్స్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
యూట్యూబ్‌లో పాటలు..
యూట్యూబ్ వేదికగా సంగీత ప్రపంచానికి తన ప్రతిభను పరిచయం చేసింది.. ఈ యువతి. మంచి సంగీతం అందిస్తుండడంతో.. కొద్ది రోజుల్లోనే అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. వివిధ భాషల్లోని పాపులర్ పాటల్ని ఇలా తనదైన శైలిలో ఆలపిస్తూ.. ఆయా అభిమానులకు దగ్గరైంది.
50 లక్షల మంది సబ్స్క్రైబర్లు
ఎమ్మా గాత్రానికి, పాటలకి ఫిదా అవుతున్న నెటిజన్లు.. ఆమె సామాజిక మాధ్యమాల్ని విపరీతంగా ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం.. ఈ యువతి యూట్యూబ్ ఛానెల్‌కు 50 లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఇక వీడియోలకైతే.. విడుదల చేసిన రోజుల వ్యవధిలోనే లక్షల, కోట్ల వ్యూస్ దాటిపోతుంటాయి.
గాయనే కాదు.. రచయిత కూడా..
గాయనిగానే కాక.. పాటల రచయితగానూ.. ఎమ్మాకు గుర్తింపు ఉంది. అంతే కాదు.. అంతర్జాతీయంగా ప్రఖ్యాత సంస్థలతో కలిసి ఆయా దేశాల్లో ప్రదర్శనలిస్తుంది.. ఎమ్మా. ఈమె ప్రతిభకు మెచ్చి ఎన్నో సంస్థలు.. ప్రశంసలు, అవార్డులతో సత్కరించారు. ఎమ్మా రూపొందించిన.. వీడియోల్లో చాలా వరకు వివిధ కేటగిరీల్లో డచ్ అవార్డ్‌లు సొంతం చేసుకున్నాయి.
2020లో ఎమ్మా హీస్టర్స్ ఆ ఏడాదిలోనే అత్యంత విజయవంతమైన డచ్ కళాకారిణిగా గుర్తింపు పొందింది. ఇలా.. సంగీత ప్రపంచంలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన ఈ యువతి.. ప్రతీ వారం ఓ సాంగ్‌ను విడుదల చేస్తుంటుంది. దాన్ని వీక్షించే వాళ్ల సంఖ్య.. వారం వారానికి పెరుగుతోంది.
ఇదీ చదవండి :