ETV Bharat / sitara

DJ Tillu movie: 'అదే జరిగితే త్వరలో 'డీజే టిల్లు 2''

DJ Tillu movie: తనకు అవకాశాలు రాకపోవడం వల్లే రైటర్​గా మారానని హీరో సిద్ధు అన్నారు. త్వరలో 'డీజే టిల్లు'తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఇతడు.. సినిమా కచ్చితంగా అలరిస్తుందని చెబుతున్నాడు.

DJ Tillu movie
డీజే టిల్లు మూవీ
author img

By

Published : Feb 10, 2022, 6:50 AM IST

"ఇది బుద్ధిగా.. ఒక పద్ధతితో రాసుకున్న కథ కాదు. క్యారెక్టర్‌ నుంచి, కథ నుంచి, త్రివిక్రమ్‌ సర్‌ సూచనల నుంచి పుట్టిన అంశాలన్నీ కలిపి 'డీజే టిల్లు' కథ రాసుకున్నాం. వినోదంతో పాటు ఒక మంచి సందేశం సినిమాలో ఉంటుంది" అన్నారు సిద్ధు జొన్నలగడ్డ. 'గుంటూరు టాకీస్‌', 'కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా' లాంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన కథానాయకుడాయన. ఇప్పుడు 'డీజే టిల్లు'గా వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. విమల్‌ కృష్ణ తెరకెక్కించిన చిత్రమిది. నేహా శెట్టి కథానాయిక. ఈ సినిమా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు హీరో సిద్ధు. ఆ సంగతులు ఏంటంటే?

ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే పూర్తిగా మీరే రాశారా? దీనికి స్ఫూర్తి ఏంటి?

కథ, స్క్రీన్‌ప్లే.. నేను, దర్శకుడు విమల్‌ కలిసి రాశాం. స్క్రిప్ట్‌ పూర్తిగా సిద్ధమయ్యాక నేనే సంభాషణలు రాశాను. ప్రేమకథకు ఓ చిన్న క్రైమ్‌ కథాంశాన్ని జోడించి ఈ స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దాం. నేను పుట్టి పెరిగిన మల్కాజ్‌గిరి ఏరియాలో గమ్మత్తైన మనస్తత్వాలున్న యువకుల్ని చూశాను. వాళ్లు తాగితే ఒకలా మట్లాడతారు. మామూలుగా ఉంటే ఒకలా మాట్లాడతారు. వాళ్లకంటూ ఓ ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్‌ ఉంటుంది. వస్త్రధారణ కూడా చాలా క్రేజీగా ఉంటుంది. వాళ్ల మాటలు కోటల్ని దాటేలా ఉంటాయి కానీ, నిజానికి జేబులో చిల్లి గవ్వ ఉండదు. అయితే అందరిలో ఓ స్వచ్ఛత ఉంటుంది. ప్రతిఒక్కరితో ఎంతో స్నేహంగా ఉంటారు. ఇలాంటి క్యారెక్టరైజేషన్‌ను తెరపై చూపిస్తే బాగుంటుందన్న ఆలోచనతోనే 'డీజే టిల్లు'ను తీర్చిదిద్దుకున్నా. ఇది కచ్చితంగా ప్రేక్షకులకు మంచి వినోదం పంచిస్తుంది. ఈ సినిమా మంచిగా ఆడితే 'డీజే టిల్లు 2'ని తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నాం".

DJ Tillu movie siddhu jonnalagadda
డీజే టిల్లు హీరో సిద్ధు

ట్రైలర్‌ చూస్తుంటే కథ మొత్తం హీరోయిన్‌ చుట్టూనే తిరగనున్నట్లు అర్థమవుతోంది కదా..

కథ మొత్తం నాయిక పాత్ర చుట్టూ అల్లుకుని ఉన్నా.. సినిమా టిల్లు క్యారెక్టరైజేషన్‌పైనే ఆధారపడి ఉంటుంది. కచ్చితంగా చెప్పాలంటే ఈ సినిమా కథ మొత్తం టిల్లు కోణంలోనే చూస్తారు. అందుకే టైటిల్‌ ‘డిజె టిల్లు’ అని పెట్టాం. వాస్తవానికి దీనికి తొలుత ‘నరుడు బ్రతుకు నటన’ అనే పేరు పెట్టాం. కానీ, అందరూ నన్ను 'టిల్లు సంగతులేంటి?' అని అడుగుతుండే వాళ్లు. దాంతో ఈ పేరు దాని కన్నా క్యాచీగా ఉంది కదా అని ఇది ఫిక్స్‌ చేశాం..

నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. మా అమ్మ ఆలిండియా రేడియోలో.. నాన్న బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేసేవారు. అన్నయ్య యూఎస్‌లో సెటిల్‌ అయ్యారు. బీటెక్‌ చేశాక నాకు ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ, నాకు వెళ్లాలి అనిపించలేదు. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక దగ్గర కూర్చొని పనిచేయలేను. ఏదో కొత్తగా చేయాలని అనిపించేది. తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీ వైపు వచ్చాను. ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లోనే ఓ సినిమా చేస్తున్నా. 'కప్పెలా' రీమేక్‌లో నటిస్తున్నా. మరో మూడు సినిమాలు లైన్‌లో ఉన్నాయి.

DJ Tillu movie
డీజే టిల్లు హీరో సిద్ధు

ఇంతకీ డీజే టిల్లు పాత్ర లక్ష్యమేంటి? ఈ పాత్ర కోసం మీరెలాంటి హోం వర్క్‌ చేశారు?

టిల్లుకు ప్రత్యేకంగా లక్ష్యమేమి ఉండదు. డీజే టిల్లు అని పేరుకే కానీ, వాస్తవానికి వాడిలో అంత టాలెంట్‌ ఉండదు. ఏదో రెండు మాస్‌ పాటలు కొట్టి.. రెండు ఈవెంట్లు చేసుకుని ఓ రూ.పదివేలు సంపాదించుకుంటుంటాడు. అలాగని దాన్నేమి దాచుకోడు. వాడి చుట్టూ తిరిగే వాళ్లకు బీర్లు పోసుకుంటూ తిరుగుతుంటాడు. అలా ఏ లక్ష్యం లేకుండా తిరిగే టిల్లు.. ఆఖరికి ఎలా మారాడు? అతను తెలుసుకున్న జీవిత సత్యమేంటి? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి. నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడే కాబట్టి ఆ యాస.. ఆ బాడీ లాంగ్వేజీ ఇట్టే పట్టేసుకోగలిగా. నిజానికి నేను ఇంట్లో వాళ్లతో మామూలుగా తెలుగులో మాట్లాడినా.. బయట ఫ్రెండ్స్‌తో కలిస్తే డీజే టిల్లు స్టైల్‌లోనే తెలంగాణ యాస మాట్లాడేస్తుంటా. అందుకే ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ఏమీ హోం వర్క్‌ చేయాల్సిన అవసరం రాలేదు.

ఇకపైనా మీ సినిమాలకు మీరే కథలు, సంభాషణలు రాసుకోవాలనుకుంటున్నారా?

అలాగని ఏమీ లేదు. నిజానికి నేను స్వతహాగా రచయితను కాదు. అవకాశాలు రాక.. ఏమి చేయాలో తెలియక.. నా కథలు నేనే రాసుకుంటే బెటరేమో అన్న ఆలోచన నుంచి రచయితగా మారా. అంతే తప్ప నా ప్రతి సినిమా నేనే రాసుకోవాలని కాదు. ప్రస్తుతం నేను చేస్తున్న మిగతా సినిమాలకు వేరువేరు రచయితలు కథ, సంభాషణలు అందిస్తున్నారు. ఎప్పుడైనా నన్ను బాగా కదిలించే ఆలోచన వస్తే మాత్రం కచ్చితంగా పేపర్‌పై పెడతా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.