ETV Bharat / sitara

'ఆర్జీవీని ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా చూడాలనేది నా కోరిక' - ఆర్​ఎక్స్ 100 డైరెక్టర్

RGV News: ఎప్పుడు వివాదాల్లో ఉండే రామ్​గోపాల్ వర్మను.. టాలీవుడ్​ పెద్ద దిక్కుగా చూడాలనేది తన కోరిక అంటూ ఓ యువ డైరెక్టర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం తెగ చర్చనీయాంశమవుతుంది.

RGV
రామ్​గోపాల్ వర్మ
author img

By

Published : Jan 3, 2022, 8:25 AM IST

Telugu cinema news: "ఇండస్ట్రీ పెద్దగా ఉండను కానీ ఆపదలో ఉంటే కచ్చితంగా ఆదుకుంటాను" అని మెగాస్టార్ చిరంజీవి అనడం, ఏపీలో టికెట్ రేట్ల విషయమై సీనియర్ నటుడు మోహన్​బాబు.. చిత్రపరిశ్రమకు బహిరంగా లేఖ రాయడం.. ఇలా ఆదివారం, టాలీవుడ్​లో పలు విషయాలు చర్చనీయాంశమయ్యాయి.

ఈ క్రమంలోనే యువ దర్శకుడు అజయ్ భూపతి చేసిన ట్వీట్ వైరల్​గా మారింది. ఎప్పుడు తన సినిమాలతో వివాదాల్లో ఉండే డైరెక్టర్​ రామ్​గోపాల్ వర్మను.. ఇండస్ట్రీ పెద్దగా చూడాలని ఉందని ట్విట్టర్​లో రాసుకొచ్చాడు. ఇది కాస్త ఇప్పుడు వైరల్​గా మారింది.

DIRECTOR AJAY BHUPATHI RGV tweet
డైరెక్టర్ అజయ్ భూపతి ట్వీట్

"మా బాస్ (రాంగోపాల్ వర్మ)ని ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చూడాలని నా కోరిక.. సామీ మీరు రావాలి సామీ" అంటూ రాసి, ఆర్జీవీ ఫొటోను కూడా ట్వీట్ చేశారు అజయ్ భూపతి.

'ఆర్ఎక్స్ 100' డైరెక్టర్​గా పరిచయమైన అజయ్ భూపతి.. తొలి సినిమాతో అద్భుతమైన హిట్​ అందుకున్నారు. కానీ రెండో సినిమా 'మహాసముద్రం'తో ప్రేక్షకుల్ని నిరాశపరిచారు. ఇప్పుడు మరో చిత్రం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.