ETV Bharat / sitara

షూటింగ్​లో 'సార్' బిజీ.. 'బంగార్రాజు'తో 'రౌడీబాయ్స్' ఢీ - karthi sardar movie

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో సార్, రౌడీబాయ్స్, 83, సర్దార్ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

movie news
మూవీ న్యూస్
author img

By

Published : Jan 7, 2022, 10:42 AM IST

Dhanush sir movie: ధనుష్ తొలి తెలుగు సినిమా 'సార్'. ఇటీవల లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పుడు షూటింగ్ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా సెట్​లోని ఫొటోలు పోస్ట్ చేశారు.

dhanush 'sir' movie
ధనుష్ సార్ మూవీ

విద్యావిధానం, అందులోని లోపాలను ఎదురించి ఓ సార్ ఎలా విజయం సాధించారు అనే కథతో ఈ సినిమా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ధనుష్​కు జోడీగా సంయుక్త మేనన్ నటిస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్​టైన్​మెంట్స్ నిర్మిస్తుంది.

Rowdy boys release date: 'రౌడీబాయ్స్' రిలీజ్​ డేట్​ను ప్రకటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి తీసుకురానున్నారు. అదే రోజు 'బంగార్రాజు' కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

rowdy boys movie
రౌడీబాయ్స్ మూవీ

కాలేజీ బ్యాక్​డ్రాప్​ కథతో తీసిన ఈ సినిమాతో ఆశిష్ హీరోగా పరిచయమవుతున్నాడు. అనుపమ హీరోయిన్​గా నటించింది. శ్రీహర్ష దర్శకత్వం వహించారు. దిల్​రాజు నిర్మాత.

83 movie OTT: 1983 ప్రపంచకప్ నేపథ్యంగా తీసిన '83' సినిమా ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్​ఫుల్​ ప్రదర్శితమవుతుంది. మరోవైపు ఒమిక్రాన్​ ప్రభావం దృష్ట్యా పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేస్తున్నారు. కొన్నిచోట్ల 50 శాతం ఆక్యుపెన్సీతో షోలు వేస్తున్నారు. దీంతో ఈ సినిమాను త్వరలో ఓటీటీలో రిలీజ్​ చేయనున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

83 movie OTT
83 మూవీ

ఈ విషయమై స్పందించిన నిర్మాణ సంస్థ.. థియేటర్లలో 8 వారాలు పూర్తయిన తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమా.. రూ.100 కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది.

Karthi sardar news: కార్తి ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా 'సర్దార్'. ఇందులో కార్తి డిఫరెంట్​ లుక్స్​కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్​గా మారాయి. గురువారం నుంచే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైందని సమాచారం.

karthi sardar movie
కార్తి సర్దార్ మూవీ

ఇందులో సిమ్రాన్, రాశీఖన్నా, రజిష విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా థియేటర్లలో చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.