ETV Bharat / sitara

100 మంది సింగర్స్​తో 'కరోనా వారియర్స్​' కోసం పాట - 'కరోనా వారియర్స్​' కోసం 100 మందితో పాట

కరోనా కట్టడి కోసం పోరాడుతున్న వారి కోసం 'వన్ నేషన్ వన్ వాయిస్' పేరుతో ఓ గీతాన్ని ఈ ఆదివారం విడుదల చేయనున్నారు. భారత్​లోని 100 మంది సింగర్స్​, 14 భాషల్లో పాడటం ఈ పాటకు ప్రత్యేకం.

'కరోనా వారియర్స్​' కోసం 100 మంది సింగర్స్​తో పాట
100 మంది సింగర్స్ కలిసి వన్ నేషన్ వన్ వాయిస్ గీతం రూపకల్పన
author img

By

Published : May 1, 2020, 4:59 PM IST

ఓ మంచి ఆశయం కోసం భారత్​లోని వివిధ భాషలకు చెందిన 100 మంది గాయనీగాయకులు ఒక్కటయ్యారు. వీరు ఓ పాటను రూపొందించి, కరోనా కట్టడి కోసం పోరాటం చేస్తున్న వారియర్స్(పోలీసులు, వైద్యులు తదితరులు)కు అంకితమివ్వనున్నారు. సింగర్స్​లో ఆశా భోంస్లే, కుమార్ సను, సోనూ నిగమ్, హరిహరన్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ్ తదితరులు ఉన్నారు.

'వన్​ నేషన్ వన్ వాయిస్' పేరుతో ఈ గీతాన్ని తెరకెక్కించారు. ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్​(ఇస్రా) తరఫున లతా మంగేష్కర్​.. మే 3న జాతికి అంకిమివ్వనున్నారు. 14 భాషల్లో రికార్డు చేసిన ఈ పాటను, 100 డిజిటల్​ ఫాట్​ఫామ్స్​లో(టీవీ, రేడియో, సోషల్ మీడియా ఇతరత్రా వాటిలో) విడుదల చేయనున్నారు.

100 singers unite for anthem dedicated to frontline warriors
100 మంది సింగర్స్ పాడనున్న ఓ గీతం

"ప్రధాని మోదీ నేతృత్వంలో కరోనాపై పోరాటం చేస్తున్న వారి కోసం ఇస్రా తరఫున మా(గాయనీగాయకులు) ప్రేమను వ్యక్తం చేయాలని అనుకున్నాం. అందులో భాగంగానే 'వన్ వాయిస్'​ పేరుతో గీతాన్ని రూపొందించి, జాతికి అంకితమివ్వనున్నాం" -ఆశా భోంస్లే, గాయని

'వన్ నేషన్ వన్ వాయిస్' అనేది గేయం కాదని ఓ ఉద్యమం అని ఎక్స్​పీ అండ్ డీబీలైవ్ డిజిటల్​ కంపెనీకి చెందిన సుకృతి సింగ్ చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.