ETV Bharat / sitara

అండర్​ కవర్​ పోలీస్​గా మెగాస్టార్ చిరంజీవి? - chiru new movies

సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తూ విభిన్న పాత్రలు చేస్తున్న అగ్రకథానాయకుడు చిరంజీవి.. కొత్త చిత్రంలో అండర్​ కవర్​ పోలీస్​గా కనిపించనున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్​గా మారింది.

chiranjeevi
చిరంజీవి
author img

By

Published : Dec 9, 2021, 5:31 AM IST

మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోరు మీదున్నారు. ఒకేసారి నాలుగు సినిమాల షూటింగ్​ల్లో పాల్గొంటూ తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నారు. ప్రస్తుతం 'ఆచార్య', 'గాడ్​ ఫాదర్', 'భోళా శంకర్' సినిమాలతో పాటు బాబీ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది.

chiru 154
సెట్​లో చిరంజీవితో డైరక్టర్ బాబీ

శ్రీలంక బ్యాక్​డ్రాప్​తో జరిగే ఈ సినిమాలో చిరు అండర్​ కవర్​ పోలీస్​గా నటిస్తున్నారని సమాచారం. ఇదే నిజమైతే మాత్రం ఫ్యాన్స్​కు పండగే. ఎందుకంటే ఈ పాత్ర చేస్తే యాక్షన్ సీన్స్​ కచ్చితంగా ఉంటాయి.

'ఆచార్య'లో నక్స్​లైట్​గా చేస్తున్న చిరు.. 'గాడ్​ఫాదర్'లో రాజకీయాల్లో చక్రం తిప్పే వ్యక్తిగా కనిపిస్తారు. అలానే 'భోళా శంకర్'లో డాన్​గా నటిస్తున్నారు. ఇలా సినిమా సినిమాకు డిఫరెంట్​ వేరియేషన్స్, విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ సినిమాల్లో ఆచార్య.. వచ్చే ఫిబ్రవరి 4న థియేటర్లలోకి రానుంది. మిగతా చిత్రాలు కూడా వచ్చే ఏడాది, 2023 ప్రారంభంలో సినీ ప్రేమికుల్ని పలకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

chiru new movies
చిరంజీవి నాలుగు సినిమాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.