ETV Bharat / sitara

సాయిధరమ్​ తేజ్​ ఆరోగ్యంపై స్పందించిన చిరు - సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్యంపై చిరంజీవీ

రోడ్డు ప్రమాదానికి గురైన సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్యంపై(Sai Dharam Tej health condition ) అభిమానులు(sai dharam tej fans) ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. మోగాస్టార్​ చిరంజీవి స్పందించారు. తన మేనల్లుడు ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎవరూ ఆందోళన పడొద్దని అన్నారు.

Sai Dharam Tej
సాయి ధరమ్ ​తేజ్​
author img

By

Published : Sep 11, 2021, 9:08 AM IST

Updated : Sep 11, 2021, 9:15 AM IST

తన మేనల్లుడు, నటుడు సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్యం(Sai Dharam Tej health condition) నిలకడగానే ఉందని.. అభిమానులెవరూ(sai dharam tej fans) ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ రాయదుర్గం పరిధి ఐకియా స్టోర్‌ సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్‌ తేజ్‌ గాయపడ్డారు. తీగల వంతెన వైపు నుంచి ఐకియా వైపు వెళ్తుండగా ప్రమాదం జరగడం వల్ల ఆయన బైక్‌పై నుంచి కిందపడిపోయారు.

దీంతో అభిమానులు సోషల్‌మీడియా వేదికగా వరుస ట్వీట్లు పెడుతున్నారు. ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రమంలో సాయి ఆరోగ్యం గురించి తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. సాయిధరమ్‌ తేజ్‌కు స్వల్పగాయాలయ్యాయని.. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చిరు తెలిపారు. అభిమానులెవరూ కంగారు పడొద్దని.. త్వరలోనే సాయి ఆరోగ్యంతో తిరిగి ఇంటికి వచ్చేస్తాడని పేర్కొన్నారు.

కాగా, ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, అల్లు అరవింద్‌, త్రివిక్రమ్‌, నిహారిక, వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌తోపాటు సందీప్‌ కిషన్‌ సైతం హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్యంపై వైద్యుల్ని ఆరా తీశారు. అనంతరం అల్లు అరవింద్‌ మీడియాతో మాట్లాడుతూ.. సాయిధరమ్‌ తేజ్‌ క్షేమంగా ఉన్నాడని తెలిపారు.

ఇదీ చూడండి: నిలకడగా మెగాహీరో సాయిధరమ్​ తేజ్​ ఆరోగ్యం

Last Updated : Sep 11, 2021, 9:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.