ETV Bharat / sitara

నకిలీ నంబర్ ప్లేట్​తో విక్కీ కౌశల్ బైక్ రైడ్​- కేసు నమోదు! - విక్కీ కౌశల్ కొత్త సినిమా

Case on Vicky Kaushal: బాలీవుడ్ యాక్టర్ విక్కీ కౌశల్​ నటిస్తున్న 'లుకా చుప్పీ 2' సినిమాలోనకిలీ నంబర్​ ప్లేట్​తో బైక్​ను వినియోగించినందుకు కేసు నమోదైంది. తన స్కూటీ నంబర్ ప్లేట్​తో బైక్​ను నడిపారని మధ్యప్రదేశ్ ఇండోర్​కు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Case on Vicky Kaushal
విక్కీ కౌశల్
author img

By

Published : Jan 2, 2022, 8:26 AM IST

Case on Vicky Kaushal: నకిలీ నంబర్ ప్లేట్​తో బైక్​ను వాడినందుకు బాలీవుడ్ యాక్టర్ విక్కీ కౌశల్ నటిస్తున్న 'లుకా చుప్పీ 2'​ సినిమా నిర్మాణ సంస్థపై కేసు నమోదైంది. షూటింగ్​లో భాగంగా విక్కీ కౌశల్​.. హీరోయిన్​ సారా అలీఖాన్​ను బైక్​పై ఎక్కించుకుని మధ్యప్రదేశ్​ ఇండోర్​​లో షికార్లు కొట్టారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అయితే.. విక్కీ వినియోగించిన బైక్ నంబర్​ నకిలీదని తేలింది.

Case on Vicky Kaushal
నకిలీ నంబర్ ప్లేట్​తో విక్కీ కౌశల్ బైక్ రైడ్​

విక్కీ బైక్ రైడ్ వీడియో చూసిన నంబర్ ప్లేట్​ రియల్ ఓనర్​, ఇండోర్​కు చెందిన జైసింగ్ యాదవ్​ షాక్​కు గురయ్యారు. 'MP-09 UL 4872' నంబర్​ గల తన స్కూటీ నంబర్​ విక్కీ బైక్​కు ఉందని నిర్ధరించుకుని పోలీసులను సంప్రదించారు. ఈ విషయాన్ని వారికి తెలిపారు. తన నంబర్ ప్లేట్​తో నకిలీ నంబర్​ను ఉపయోగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆ నంబర్​ వినియోగిస్తున్న వాహనం వల్ల ఎవరైనా ప్రమాదానికి కారణమైతే తాను బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆందోళన చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఒకే నంబర్​ ప్లేట్​ను రెండు వాహనాలకు ఉపయోగించకూడదని తెలిపారు.

Case on Vicky Kaushal
నంబర్ ప్లేట్ రియల్ ఓనర్​

Vicky Kaushal Movies: విక్కీ కౌశల్, సారా అలీఖాన్ జంటగా నటిస్తున్న చిత్రం 'లుకా చుప్పీ 2'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్​ మధ్యప్రదేశ్, ఇండోర్​లో జరుగుతోంది. ఇటీవలే విక్కీ.. హీరోయిన్​ కత్రినా కైఫ్​ను వివాహం చేసుకుని మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు.

ఇదీ చదవండి: అగ్గిబరాటాల కథతో.. ఆస్కార్‌కు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.