ETV Bharat / sitara

బ్రహ్మానందంపై బాలయ్య సీరియస్.. ఎందుకంటే? - అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే ఎపిసోడ్​ 3 ప్రోమో రిలీజ్​

balakrishna unstoppable promo: 'ఆహా' ఓటీటీ వేదికగా హీరో బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే' మూడో ఎపిసోడ్​ ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ ఎపిసోడ్​ను బ్రహ్మానందం, అనిల్ రావిపూడిపై చిత్రీకరించారు. వీరితో బాలయ్య చేసిన సందడి అలరిస్తోంది.

unstoppable with hbk promo
అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే ప్రోమో రిలీజ్​
author img

By

Published : Dec 1, 2021, 8:18 PM IST

unstoppable with nbk episode 3 promo: 'ఆహా' ఓటీటీ వేదికగా నందమూరి హీరో బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే' మూడో ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. 'వారం వారం రావడానికి నేను సీరియల్​ని కాదు సెలబ్రేషన్​' అంటూ గ్రాండ్​ ఎంట్రీ ఇచ్చారు నందమూరి నటసింహం. 'ఎన్ని సమస్యలొచ్చినా నవ్వడం ఆపొద్దు.. నవ్వించటం ఆపొద్దు', 'ముందుంది ముసళ్ల పండగ' అంటూ హాస్యం కురిపించారు.

ఈ షోకు ఈ వారం అతిథిలుగా హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపుడి వచ్చి సందడి చేశారు. 'బాలయ్య గారు కామెడీ కూడా చేస్తారు.. కానీ కమెడియన్ కాదు.. సింహం.. నటసింహం..' అంటూ బ్రహ్మనందం చెప్పిన డైలాగ్​లు ఆకట్టుకున్నాయి. చివర్లో బ్రహ్మీపై బాలయ్య కోపం తెచ్చుకున్న సన్నివేశం ఎపిసోడ్​పై ఆసక్తిని రేకెత్తిస్తోంది. శుక్రవారం రోజున ఈ పూర్తి ఎపిసోడ్​ స్ట్రీమింగ్ కానుంది. అప్పటివరకు ఈ ప్రోమో చూసేయండి మరి..!

ఇదీ చదవండి:యూఏఈలో కత్రినా కైఫ్​-విక్కీ కౌశల్​ ప్రేమజంట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.