ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే అతిశయోక్తి కాదు. 'బాహుబలి', 'సాహో' చిత్ర వసూళ్లే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. అందుకే పాన్ ఇండియా కథలను తెరకెక్కించాలనుకునే దర్శక నిర్మాతల తొలి చూపు డార్లింగ్ పైనే పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ టాలీవుడ్ స్టార్‌తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు.
అయితే ఇప్పటికైతే ఈ అవకాశం రాలేదు కానీ, 'ప్రభాస్ 21' నిర్మాణ విషయంలో ఓ బడా బాలీవుడ్ సంస్థకు అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించబోయే ఈ భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని.. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నిర్మించబోతుంది. దీని కోసం దాదాపు రూ.250కోట్లకు పైగా బడ్జెట్‌ను కేటాయించినట్లు సమాచారం.
అయితే ఇప్పుడీ ప్రాజెక్టు విషయంలో ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ.. వైజయంతి మూవీస్‌తో కలిసి పని చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ ఇంతటి భారీ బడ్జెట్ చిత్రంలో భాగస్వామ్యం అన్నది కలిసొచ్చే అంశమే కాబట్టి వైజయంతి సంస్థ కూడా దీనికి అంగీకరించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.