ETV Bharat / sitara

'చిన్నారి పెళ్లికూతురు' దర్శకుడు.. కూరగాయలు అమ్ముతూ - కూరగాయలు అమ్ముకుంటున్న బుల్లితెర దర్శకుడు

'చిన్నారి పెళ్లికూతురు' సహాయ దర్శకుడు రామ్​ వృక్ష్​ గౌర్​.. ప్రస్తుతం షూటింగ్​లు జరగక కూరగాయల విక్రేతగా మారారు.

Balika Vadhu serial director turns vegetable vendor in UP's Azamgarh
కూరగాయల విక్రేతగా 'చిన్నారి పెళ్లికూతురు' దర్శకుడు
author img

By

Published : Sep 28, 2020, 4:14 PM IST

బుల్లితెర ధారవాహిక 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ సహాయ దర్శకుడు రామ్​ వృక్ష గౌర్​.. కూరగాయలు విక్రయిస్తున్నారు. లాక్​డౌన్ కారణంగా చిత్రీకరణలకు బ్రేక్​ పడటం వల్ల స్వగ్రామంలో ఈ పని చేస్తున్నట్లు వెల్లడించారు.

"నేను ఓ సినిమా తర్వాత విరామంలో అజంఘర్ వచ్చాను. లాక్​డౌన్​ ప్రకటించినప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయాను. తిరిగి వెళ్లడం కుదరలేదు. మేం చేస్తున్న ప్రాజెక్టు ప్రస్తుతం ఆగిపోయింది. అది తిరిగి ప్రారంభం కావడానికి మరో ఏడాది లేదా అంతకంటే ఎక్కువ సమయమే పట్టొచ్చని నిర్మాత చెప్పారు. ఈ విరామంలో నా తండ్రి వ్యాపారాన్ని చేయాలని నిర్ణయించుకున్నాను. కూరగాయలు అమ్మడం ప్రారంభించాను. నాకు వ్యాపారం తెలుసు బాగా తెలుసు. ఇందులో విచారించాల్సింది ఏమీ లేదు"

- రామ్​ వృక్ష్​ గౌర్​, సహాయ దర్శకుడు

"2002లో నా స్నేహితుడు, రచయిత షహనావాజ్​ ఖాన్​ సహాయంతో ముంబయి వెళ్లాను. తొలుత లైటింగ్​ విభాగంలో చేరి.. ఆ తర్వాత టీవీ సీరియల్స్​ నిర్మాణంలో పనిచేశాను. నేను అసిస్టెంట్​ డైరెక్టర్​ అయ్యాక అనేక సీరియల్స్​ నిర్మాణంలో.. చిన్నారి పెళ్లికూతురు ఎపిసోడ్​ డైరెక్టర్​, యూనిట్​ డైరెక్టర్​గా వర్క్​ చేశాను. నాకు ముంబయిలో సొంత ఇల్లు ఉంది. పరిస్థితులు సద్దుమణిగే వరకు నేను చేయగలిగింది చేస్తున్నాను" అని రామ్ వృక్ష్​ గౌర్​ వెల్లడించారు.

మిలింద్​ గునాజీ, రాజ్​పాల్​ యాదవ్​, రణదీప్​ హుడా, సునీల్​ శెట్టి చిత్రాలకు అసిస్టెంట్​ డైరెక్టర్​గానూ రామ్​ వృక్ష్​ పనిచేశారు. కరోనా​ ప్రారంభానికి ముందు భోజ్​పురి, హిందీ చిత్రాల్లో పనిచేయడానికి సిద్ధమవగా.. అంతలోనే లాక్​డౌన్​ విధించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.