Akhanda Making Video: మొన్నటివరకు థియేటర్లలో సందడి చేసిన బాలయ్య 'అఖండ'.. ఇప్పుడు ఓటీటీలో రికార్డు వ్యూస్‌తో దూసుకెళ్తుంది. ఈ క్రమంలోనే సినిమా మేకింగ్ వీడియోను ఆదివారం రిలీజ్ చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇందులో బాలయ్య.. 'అఖండ'గా ఎలా మారారు? బోయపాటి ఎలా యాక్షన్ చేసి చూపించారు? తదితర విషయాల్ని ఈ వీడియోలో చూపించారు. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయగా, అందులో ఒకటి అఘోరా పాత్ర. తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది.
Priyamani bhama kalapam movie: ప్రియమణి ప్రధాన పాత్రలో నటించి వెబ్ మూవీ 'భామా కలాపం'. ఈ చిత్ర టీజర్‌ను స్టార్ హీరోయిన్ రష్మిక రిలీజ్ చేసింది. ఆద్యంతం ఆకట్టుకుంటున్న ఈ టీజర్ హాస్యభరితంగా సాగుతూ అలరిస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఓ అపార్ట్మెంట్లో ఉండే అనుపమ అనే గృహిణి పాత్రలో ప్రియమణి నటించింది. అపార్ట్మెంట్లోని అందరి ఇళ్లలో జరిగే విషయాలు తెలుసుకునే అనుపమ.. ఓ మర్డర్‌ను చూస్తుంది. ఆ తర్వాత ఎదురైన పరిణామాలేంటి అనే కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఫిబ్రవరి 11న 'భామా కలాపం' రిలీజ్ కానుంది.
Malli modalaindi movie OTT: సుమంత్ హీరోగా నటిస్తున్న 'మళ్లీ మొదలైంది' ఓటీటీ రిలీజ్ ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 11న నేరుగా జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించారు.

ఇందులో సుమంత్ సరసన నైనా గంగూలీ హీరోయిన్గా చేసింది. పెళ్లయిన జంట మధ్య వచ్చే మనస్పర్థల కారణంగా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ తర్వాత ఏం జరిగింది అనే కథతో ఈ సినిమా తీసినట్లు తెలుస్తోంది. కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు.
MM Keeravani news: ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి క్రేజీ ఛాన్స్ దక్కించుకున్నారు. 'జెంటిల్మన్ 2' చిత్రానికి మ్యూజిక్ అందించనున్నారు. నిర్మాత కేటీ కుంజమున్, ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించారు.

'ప్రేమికుడు', 'ప్రేమదేశం' లాంటి సినిమాలు నిర్మించిన కుంజమున్.. 1999 తర్వాత నిర్మాతగా చిత్రాలు తీయలేదు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత 'జెంటిల్మన్' సీక్వెల్‌ను ఇటీవల ప్రకటించారు. త్వరలో నటీనటులతో పాటు ఇతర వివరాలు ప్రకటించనున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇవీ చదవండి: