నందమూరి బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్' తొలి ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. సీనియర్ నటుడు మోహన్‌బాబు విచ్చేసి, హోస్ట్ బాలయ్యతో కలిసి తెగ సందడి చేశారు. ఆయన అడిగిన ప్రశ్నలకు మోహన్‌బాబు పలు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
"నేను మీకు తెలుసు. నా స్థానం మీ మనసు" అని చెప్పిన బాలయ్య డైలాగ్‌తో ప్రోమో మొదలైంది. "ఎవరి జీవితం కళా ప్రపూర్ణమో, ప్రజాసేవ సంపూర్ణమో ఆయనే" అని బాలకృష్ణ డైలాగ్ చెప్పే సమయానికి మోహన్‌బాబు ఎంట్రీ ఇచ్చారు.
![balakrishna Unstoppable Promo](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13509144_balayya.jpg)
మీరు యాక్ట్ చేసిన సినిమాల్లో అస్సలు చూసుకోలేని సినిమా ఏది అని మోహన్‌బాబును బాలయ్య అడిగారు. 'పటాలం పాండు' అని మోహన్‌బాబు సమధానమిచ్చారు. "చిరంజీవి మీద మీకు నిజంగా ఉన్న అభిప్రాయమేంటి?" అని బాలయ్య, మోహన్‌బాబును అడిగారు. "ఆయన అన్ని చూస్తుంటారు. నేను మాత్రం.. " అంటూ మోహన్‌బాబు చెప్పారు. దీని బట్టి ఏదో ఆసక్తికర విషయం ఎపిసోడ్లో ఉండనున్నట్లు తెలుస్తోంది.
"హీరోగా నిలబడాలనే ప్రయత్నంలో విఫలమవుతున్న రోజుల్లో ఎప్పుడైనా బాధపడ్డారా?" అని బాలయ్య అడగ్గా.. "తలుచుకుంటే ఏడుపొస్తుంది సోదరా.. పిల్లల కోసం చేస్తున్నాను. ఇల్లు అమ్మేశాను. ఎవరూ హెల్ప్ చేయలేదు" అని అన్నారు.
చివర్లో మోహన్‌బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న, మంచు విష్ణు కూడా వచ్చి షోలో సందడి చేశారు. 'జై బాలయ్య' అని అన్న లక్ష్మీ.. బాలయ్య అభిమానుల్లో జోష్ తెప్పించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">