ETV Bharat / sitara

NBK107: బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్​ షురూ - Balakrishna akhanda movie

హీరో బాలకృష్ణ(gopichand malineni balakrishna) నటించనున్న కొత్త సినిమా షూటింగ్​ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ మూవీకి గోపిచంద్​ మలినేని దర్శకత్వం వహిస్తుండగా.. శ్రుతిహాసన్​ హీరోయిన్​గా నటించనుంది.

balakrishna
బాలకృష్ణ-గోపిచంద్​ మలినేని సినిమా షూటింగ్​ షురూ
author img

By

Published : Nov 13, 2021, 11:33 AM IST

Updated : Nov 13, 2021, 3:48 PM IST

.

నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్​ ప్రారంభమైంది(balakrishna gopichand malineni). గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో శనివారం ఉదయం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది(balakrishna updates). ఈ కార్యక్రమానికి చిత్రబృందంతో పాటు పలువురు టాలీవుడ్‌ దర్శకులు హాజరై అభినందనలు తెలిపారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ, బోయపాటి శ్రీను, హరీశ్‌ శంకర్‌, వి.వి.వినాయక్‌, బుచ్చిబాబు, బాబీతోపాటు మాటల రచయిత సాయిమాధవ్‌ బుర్రా ఈ వేడుకలో పాల్గొన్నారు.

బాలయ్య 107వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. పక్కా మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సిద్ధం కానున్నట్లు సమాచారం. ఇందులో బాలయ్య ఫుల్‌ యంగ్‌ లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణకు జోడీగా నటి శ్రుతిహాసన్‌(shruti haasan balakrishna) సందడి చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై ఈ చిత్రం నిర్మితమవుతోంది.

balayya
బాలయ్య కొత్త సినిమా షూటింగ్​ షూరూ

కాగా, ఇటీవల విడుదలైన 'క్రాక్‌' చిత్రంతో గోపీచంద్‌ మలినేని సూపర్‌హిట్‌ను సొంతం చేసుకున్నారు. ఇక, బాలయ్య.. త్వరలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'అఖండ'(Balakrishna akhanda movie) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్ ప్రతినాయకుడిగా చేశారు. పూర్ణ కీలకపాత్ర పోషించారు. తమన్ సంగీతమందించారు. మిర్యాల రవీందర్​రెడ్డి నిర్మించారు.

ఇదీ చూడండి: పవన్​తో అనిల్ రావిపూడి చిత్రం.. 'ఎఫ్​2' తరహాలో!

Last Updated : Nov 13, 2021, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.